Type to search

పేద కార్మికులకు నటీ నటుల విరాళం

Box Office Latest News Trenging News

పేద కార్మికులకు నటీ నటుల విరాళం

కరోనా ప్రభావం తెలుగు రాష్ట్రాలలో కూడా అధికంగానే ఉంది, నిన్న ఒక్కరోజే ఏడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్‌ ప్రభావంతో ఈ నెలాఖరు వరకు సినిమా షూటింగ్‌లు బంద్ చేయాలనీ నిర్ణయం తీసుకున్నారు. అయితే సినిమా షూటింగ్ లు లేకపోవడం వలన వివిధ శాఖలలో పనిచేస్తున్న పేద కార్మికులను ఆదుకోవడానికి పలువురు సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఇంతక ముందే చిత్ర సీమ లోని పేద కార్మికులకు అవసరమైన సరుకులను అందజేస్తాం అని రాజశేఖర్, జీవిత లు ముందుకు వచ్చారు.అలాగే వ్యక్తిగత పరిశుద్దత పాటించడం ప్రతి పౌరీది బాధ్యత అని వారు చెప్పారు.
ఇప్పుడు అదే దారిలో హీరో నితిన్ కూడా వారిని ఆదుకోవడానికి ముందుకు వచ్చారు.ఆయన తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ప్ర‌జ‌లంద‌రూ రెండు రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు స‌హ‌క‌రించాల‌ని కోరారు. ఈ సంద‌ర్భంగా నితిన్ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల స‌హాయ‌నిధికి రూ. 10 ల‌క్ష‌ల చొప్పున విరాళాన్ని అందజేయనున్నట్టు నితిన్ తెలిపారు. దీనికి సంబంధించిన విషయాన్ని నితిన్ ట్విట్టర్లో పోస్ట్ చేసాడు. అయితే మార్చి 31వ తేదీ వ‌ర‌కు ప్రభుత్వాలు ప్ర‌క‌టించిన లాక్‌డౌన్‌కు ప్ర‌జ‌లు స‌హ‌క‌రించాల‌ని కోరారు. అంద‌రూ త‌మ త‌మ ఇళ్ల‌ల్లోనే ఉండి కోవిడ్‌-19 వ్యాప్తిని నిరోధించ‌డంలో అందరూ సహకరించాలని నితిన్ విజ్ఞ‌ప్తి చేశారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *