Type to search

పిల్లలకు రానా బంపర్ ఆఫర్… ఏసీకే, టింకిల్ యాప్స్ ఫ్రీ!

Box Office Latest News Trenging News

పిల్లలకు రానా బంపర్ ఆఫర్… ఏసీకే, టింకిల్ యాప్స్ ఫ్రీ!

 

భారత ప్రధాన మంత్రి కరోన పై ఫైట్ చేయడానికి వీలైన్తా వరకు ఇంట్లోనే ఉండమని సందేశం ఇవ్వడం తో నెల‌కొన్న ప్రజలు ఎక్కువ సమయం ఇళ్లలోనే గడుపుతున్నారు. స్కూళ్లకు సెలవులు ఇవ్వడంతో పిల్లలు కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. పిల్లలు పార్కులకు, మాల్ లకు , ఆటలు ఆడుకోవడానికి బయటకు వెళ్లకుండా గంటలు గంటలు ఇంట్లోనే గడుపుతుండటంతో వాళ్లకు కూడా బోర్ కొడుతుంది కదా. ఆదే విధం గా తల్లి తండ్రులకు కూడా ఇది ఎంతో కష్టకాలం.పిల్లలు టీవీలో వచ్చే కార్యక్రమాలు చూస్తారు కానీ ఆ కార్టూన్స్ ను కూడా ఆదే పనిగా చూస్తే బోర్ కొడుతుంది. అందుకనే.. దేశవ్యాప్తంగా ప్రజ‌ల‌కు ఒక చ‌క్కని కానుక‌ను ఆఫ‌ర్ చేశారు హీరో రానా. ఒక నెల రోజుల పాటు పిల్లలు బాగా ఇష్టపడే ఏసీకే (అమ‌ర్ చిత్ర క‌థ‌), టింకిల్ యాప్స్‌లోని కంటెంట్‌ను ఉచితంగా తిల‌కించ‌వ‌చ్చని ప్రక‌టించారు. ఆ రెండు యాప్స్ ఆయ‌న‌వే. ఇవి కామిక్స్ యాప్స్.
‘‘ఏసీకే విష‌యంలో ఈ నెల‌లో ఆన్‌లైన్ స‌భ్యత్వాల‌ను మొద‌లుపెట్టాల‌ని నిర్ణయించుకున్నాం. కాబ‌ట్టి ఏసీకే, టింకిల్ యాప్స్‌లోని అద్భుత‌మైన కంటెంట్‌ను పిల్లలు, పెద్దలు ఉచితంగా చూసుకోవ‌చ్చు. వాటిలో త‌మ‌కు ఇష్టమైన దాన్ని చ‌దువుకోవ‌చ్చు. అందులో ఉన్నవ‌న్నీ మ‌న ప్రాంతం క‌థ‌లు. అవి చ‌దివితే మ‌న దేశం, మ‌న దేవుళ్లు, రాజులు, సంస్కృతి గురించి తెలుస్తుంది. చ‌క్కని బొమ్మలు, క‌థ‌ల‌తో అవి అల‌రిస్తాయి. మ‌న గ‌తం గురించి తెలుసుకొని, భ‌విష్యత్తును నిర్మించుకోవ‌డానికి నేటి త‌రానికి ఇది చాలా ముఖ్యం’’ అని రానా చెప్పారు.

కరోనా వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో సినిమా స‌హా ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇండ‌స్ట్రీ మొత్తం కార్యక‌లాపాల్ని నిలిపివేసిన సంగతి తెలిసిందే. అనేక‌ మంది సెల‌బ్రిటీలు క‌రోనా వైర‌స్ వ్యాప్తి కాకుండా, అది సోక‌కుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సూచ‌న‌లు చేస్తూ, ప్రజ‌ల్లో చైత‌న్యం తీసుకురావ‌డానికి కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే త‌న ‘అర‌ణ్య’ చిత్రం విడుద‌ల‌ను వాయిదా వేసిన హీరో రానా ద‌గ్గుబాటి.. సామాజిక దూరం పాటిస్తూ వైర‌స్ వ్యాప్తి చెంద‌కుండా చూడాల‌ని ప్రజ‌ల‌కు పిలుపునిచ్చారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *