Type to search

పవన్ కళ్యాణ్ నీ సేవాగుణం ఎల్లప్పుడూ కొత్త మార్పును ప్రేరేపిస్తాయి:మహేశ్ బాబు

Box Office Latest News Trenging News

పవన్ కళ్యాణ్ నీ సేవాగుణం ఎల్లప్పుడూ కొత్త మార్పును ప్రేరేపిస్తాయి:మహేశ్ బాబు

నేడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజును ఆయన అభిమానులు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇక పవన్ నటిస్తున్న ‘వకీల్ సాబ్’ నుంచి మోషన్ పోస్టర్ , క్రిష్ సినిమాకు సంబందించిన అప్డేట్ రావడంతో పవన్ అభిమానుల ఆనందం రెట్టింపైంది. ఇక పవన్ కు సినీ ప్రముఖులు , రాజకీయ ప్రముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.  సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా పవన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తన ట్విట్టర్లో ఓ పోస్ట్ పెట్టారు. ” పుట్టినరోజు శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ నీ సేవాగుణం, వినయం ఎల్లప్పుడూ కొత్త మార్పును ప్రేరేపిస్తాయి. నీకు ఎల్లప్పుడూ ఆనందం మంచి ఆరోగ్యం కలగాలని కోరుకుంటున్నాను” అంటూ మహేశ్ బాబు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ తో పాటు పవన్ కళ్యాణ్ తో ఉన్న పాత ఫొటోను కూడా మహేష్ షేర్ చేశారు. ఈ ట్వీట్ కి మహేష్ – పవన్ అభిమానులు పెద్ద ఎత్తున లైక్స్ కొడుతూ రీ ట్వీట్స్ చేస్తున్నారు.కొంతమంది పవన్ కళ్యాణ్ , మహేష్ ఫ్యాన్స్  నిత్యం ఎదో ఒకగొడవ పడుతూనే ఉంటారు. కానీ ఈ ఇద్దరు స్టార్లు మాత్రం తమ మధ్య ఆప్యాయతను అవసరం వచ్చినప్పుడల్లా చూపుతూనే ఉంటారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *