Type to search

పలాస 1978… రివ్యూ

Box Office Latest News Movie Reviews Trenging News

పలాస 1978… రివ్యూ

రక్షిత్, నక్షత్ర హీరోహీరోయిన్లుగా తమ్మారెడ్డి భరధ్వాజ సమర్పణలో సుధా మీడియా పతాకంపై ధ్యాన్ అట్లూరి నిర్మించిన చిత్రం ‘పలాస 1978’. కరుణ కుమార్ అనే నూతన దర్శకుడు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ రోజు (మార్చి 6) ఈ మూవీ రిలీజ్ అయింది.
1978 ప్రాంతంలో పలాసలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో ఈ సినిమా రూపొందించారు. ఈ చిత్రం సెన్సార్ బోర్డు నుంచి ‘A’ సర్టిఫికేట్ పొందింది. రఘు కుంచె, తిరువీర్, జనార్థన్, లక్ష్మణ్, శృతి, జగదీష్ ముఖ్యపాత్రలు పోషించారు.
కథ:
ఈ కథ పలాస అనే ఊరిలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా సాగుతుంది. ఈ చిత్రం కుల వివక్ష ను కళ్ళకు కట్టి నట్టు చూపిస్తుంది. పలాస లో జరిగే జీడిగింజల వ్యాపారం, అక్కడ షావుకార్లు దురాగతాలు, క్రింద కులాల వారిని తమ వ్యాపారం కోసం ఉపయోగించుకోవటం వంటి పాయింట్‌ని డీల్ చేస్తుంది.

తమ్మారెడ్డి భరద్వాజ వాయిస్‌తో సినిమాను ప్రారంభించి ముందుగా పలాసలో జరిగిన ఓ హత్యను చూపించారు. చిత్ర ప్రారంభం నుంచే సీరియస్ సన్నివేశాలను చూపిస్తూ విలన్ రఘు కుంచె ఎంట్రీ, ఆ తర్వాత హీరో రక్షీత్, హీరోయిన్ నక్షత్ర ఎంట్రీ చూపించారు.
ఓ పాట, అనంతరం హీరో రక్షిత్ యాక్షన్ సన్నివేశాలు చూపిస్తూ కథను ముందు సాగించారు. విలన్ రఘు కుంచె గేమ్ ప్లాన్ స్టార్ట్ కావడం, వెనుకబడిన కులాల గొంతుక వినిపిస్తూ హీరో వెళ్లడం లాంటి సన్నివేశాలతో కథ అలా సాగిపోయింది.
హీరోని అణగతొక్కేందుకు ధనిక వర్గాల ప్రయత్నాలు చూపిస్తూ ఫస్ట్ హాఫ్ ను ముగించారు. సెకండాఫ్ చూడాలనే ఆతృతను నింపుతుంది ఫస్ట్ హాఫ్.
విరామం తర్వాత కొన్ని కీలక సన్నివేశాలు చూపిస్తూ హీరోపై , హీరో కుటుంబంపై హత్యాయత్నం జరగడం ….
ఆ తర్వాత హీరో తన ప్రియమైన వ్యక్తిని కోల్పోవడం, నిస్సహాయకుడిగా మారడం లాంటి సన్నివేశాలతో కథ క్లైమాక్స్ కు చేరుకుంటుంది. చివరకు ఓ మంచి సందేశం తో సినిమా ముగుస్తుంది.
తిరువీర్, జనార్థన్, లక్ష్మణ్, శృతి, జగదీష. ఇతర పాత్రల్లో నటించారు. డైరెక్టర్ కరుణ కుమార్ మాత్రం సినిమాని తాను ఎలా తియ్యాలనుకున్నాడో అలానే తీసాడు.పాత్రల ఎంపిక నుండి వాళ్ళు మాట్లాడుకునే భాష వరకు చాలా సహజంగా ఉండేలా చూసుకున్నాడు.
రక్షిత్ ను ఈ సినిమాకు హీరో గా ఎంచుకోవడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే చాలా చోట్ల సన్నివేశానికి ఉన్న బలాన్ని అతని నటన నిలబెట్టలేకపోయింది. రక్షిత్ నటుడిగా ఈ సినిమాకోసం చాలా కష్టపడ్డాడు. హీరోయిన్ నక్షత్ర తన పాత్ర పరిధి వరకు వంక పెట్టడానికి లేకుండా నటించింది. చిన్న షావుకారుగా రఘుకుంచె ఓకే అనిపిస్తాడు. చాలా కాలం తరువాత మిర్చి మాధవికి కాస్త ఇంపాక్ట్ ఉన్న పాత్ర దక్కింది.ఆ పాత్రకి ఆమె న్యాయం చేసింది. ఇక మిగిలిన పాత్రలు అన్నీ కూడా డైరెక్టర్ విజన్ కి తగ్గట్టుగా కనిపించాయి,పర్లేదు అనిపించాయి.

రఘు కుంచె అందించిన సంగీతం ఈ సినిమాకి పెద్ద ప్లస్ అనే చెప్పుకోవాలి. పాటలు సినిమా ఫ్లో లో కలిసి సాగిపోయాయి. నేపధ్య సంగీతం చాలా క్వాలిటీ గా ఉంది. విన్సెంట్ అరుల్ సినిమాటోగ్రఫీ కూడా మెప్పిస్తుంది.నిర్మాణ విలువలు ఒక మోస్తరుగా ఉన్నాయి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *