Type to search

పబ్లిక్ గా నాగ చైతన్యను కిస్స్ చేసిన సాయి పల్లవి!

Box Office Latest News Trenging News

పబ్లిక్ గా నాగ చైతన్యను కిస్స్ చేసిన సాయి పల్లవి!

నాగ చైతన్య, సాయి పల్లవిలు జంటగా నటిస్తోన్న “లవ్ స్టోరీ”నుండి ఈ రోజు ఒక సాంగ్ ప్రివ్యూ రిలీజ్ చేశారు. వాలెంటైన్స్ డే సంధర్భంగా ఈ ప్రోమో ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ పాత ఈ రోజు ఉదయం 11 గంటలకు విడుదల చేయగా, సోషల్ మీడియా లో ప్రస్తుతం ఒక సెన్సేషన్ గా మారి రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ పాటలో సాయి పల్లవి, చైతును కిస్స్ చేసే సీన్ హైలైట్ అని అభిమానులు అంటున్నారు.”ఏ పిల్లా” అంటూ మొదలయ్యే ఈ సాంగ్ చాలా క్యాచీ గా ఉంది.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా యూత్ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా సారి కొత్త కథాంశం తో రాబోతుందని తెలుస్తోంది. తనదైన శైలిలో వైవిధ్యభరితమైన చిత్రాలు తెరకెక్కించే దర్శకుడు శేఖర్ కమ్ముల. లవ్ స్టోరీ చిత్రాన్ని శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తుండడం తో ఈ చిత్రం పై అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
“ఏ పిల్లా” సాంగ్ ను హరిచరణ్ పాడగా, ఈ పాటకు లిరిక్స్ చైతన్య పింగళి అందించారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది చిత్ర యూనిట్.

Tags:

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *