Type to search

పదవ తరగతి రీ యూనియన్ విద్యార్థులను కలచి వేసే జాను

Box Office Movie Reviews Trenging News

పదవ తరగతి రీ యూనియన్ విద్యార్థులను కలచి వేసే జాను

చిత్రం : జాను

నటీనటులు: శర్వానంద్,సమంత,వెన్నెల కిషోర్,శరణ్య,తాగుబోతు రమేష్ తదితరులు

సినిమాటోగ్రఫీ:మహేంద్రన్ జయరాజు

మ్యూజిక్: గోవింద్ వసంత

ఎడిటర్: కె.ఎల్ ప్రవీణ్

మాటలు: మిర్చి కిరణ్

నిర్మాత: దిల్ రాజు

రచన,దర్శకత్వం: ప్రేమ్ కుమార్

తమిళ్‌లో సూపర్ హిట్ గా పేరు తెచ్చుకున్న సినిమాని ఇప్పుడు తెలుగులో ‘జాను’ పేరుతో రీమేక్ చేశారు దిల్ రాజు. తమిళం లో విజయ్ సేతుపతి, త్రిష తమ నటన తో ప్రాణం పోసిన జానకి, రామ్ పాత్రలకి తెలుగులో సమంత, శర్వానంద్ ని ఫిక్స్ చెయ్యడం, అలాగే తమిళ్‌లో ఈ సినిమాని తెరకెక్కించిన మేజర్ టెక్నీషియన్స్ ఈ రీమేక్‌కి వర్క్ చెయ్యడం, ట్రైలర్ కూడా ఒరిజినల్ ఫీల్‌ని క్యారీ చెయ్యడంతో ఈ సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. మరి ‘జాను’ ఆ అంచనాలను ఎంతవరకు నిలబెట్టుకుంది?, ప్రేక్షకులకు ఎంత వరకు అలరించిందో అనేది ఇప్పుడు చూద్దాం :

కథ:
ట్రావెల్ ఫోటోగ్రాఫర్ గా ఉన్న రామ్ (శర్వానంద్) చాలా కాలం తరువాత తన సొంత ఊరికి తిరిగివస్తాడు. అక్కడ తాను చదివిన స్కూల్‌కి వెళతాడు. అక్కడికి వెళ్ళిన తరువాత పాత జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటుండగా పాత మిత్రులను కలవడానికి గెట్ టు గెదర్ పెట్టాలనుకుంటాడు , దానికి ఫ్రెండ్స్ అంతా కూడా ఓకే అనడంతో గెట్ టు గెదర్ డేట్ ఫిక్స్ చేస్తారు. ఆ గెట్ టు గెదర్‌కి అందరితో పాటు జానకి (సమంత) కూడా వస్తుంది. అయితే రామ్‌కి, జానుకి మధ్య ఒక ఫీల్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది.

వాళ్లిద్దరూ చిన్నప్పటి నుండి ఒకరికి ఒకరు బాగా తెలుసు. అయితే జానకి అంటే రామ్‌కి చాలా ఇష్టం.ఆ ఇష్టం కాస్త ప్రేమగా మారుతుంది. జానకి కి కూడా రామ్‌ని ఇష్టపడుతుంది.కానీ పదో తరగతి పరీక్షలు పూర్తయి 11 తరగతిలోకి వచ్చేసరికి రామ్ వాళ్ళ ఫామిలీ ఊరు విడిచి వెళ్ళిపోతుంది.ఇక జాను వేరే పెళ్లి చేసుకుంటుంది. కానీ రామ్ మాత్రం పెళ్లి చేసుకోకుండా ఉండిపోతాడు. అయితే దాదాపు 15 సంవత్సరాల తరువాత కలిసిన రామ్, జానకి ఎలా ఫీల్ అవుతారు?, వాళ్ళ మధ్య ఏర్పడిన తొలిప్రేమ అనుభవాలను ఎలా గుర్తుచేసుకుంటారు?, చివరికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఈ సినిమా స్టోరీ.

నటీనటులు ఎలా చేశారంటే ..
శర్వానంద్ మెచ్యుర్డ్ నటన తో కట్టిపడేసాడు.ఒరిజినల్ వెర్షన్ లో విజయ్ సేతుపతి నటనకు ఏమాత్రం తగ్గకుండా నటించి సూపర్ అనిపించుకున్నాడు.ముఖ్యంగా సెకండాఫ్ లో శర్వా మంచి నటన కనబరిచాడు.సమంత చెప్పనవసరం లేదు తన సహజ నటనతో అందరినీ కట్తిపడేసింది.ఎమోషనల్ సీన్లలో బాగా చేసింది.ఇక హైస్కూల్ డేస్ లో నటించిన అందరూ బాగా చేశారు.,వెన్నెల కిషోర్,తాగుబోతు రమేష్, శరణ్య కూడా బాగా చేశారు.
అయితే ఇప్పటివరకు చెప్పుకున్నదంతా ‘జాను’లోని ఒక కోణం. రెండో కోణం చూస్తే ఈ సినిమా పాయింట్‌లోనే చాలా స్లో నెర్రేషన్‌లో చెప్పాలి అనే నిబంధన ఇమిడిపోయి ఉంది. అందుకే డైరెక్టర్ అనుకున్న ఫీల్ ప్రేక్షకుడికి కన్వే అవ్వడానికి, సినిమా సహజత్వంగా తెరకెక్కించాలి అనే ఆలోచన కూడా తోడయ్యి సినిమా వేగం బాగా మందగించింది. మళ్ళీ ఇందులో కూడా చాలా వరకు ల్యాగ్స్ కూడా ఉన్నాయి. ఒరిజినల్ ఎలా ఉండాలో ఈ సినిమా కూడా అలానే ఉండాలి అనే రూల్ పెట్టుకున్న డైరెక్టర్ సినిమాకి అనవసరమయిన కొన్ని సీన్స్ కూడా అలానే ఉంచేసాడు.

సినిమా స్లో గా ఉంది, అలాగే ల్యాగ్స్ తో పాటు ఈ సినిమాలో ముందు ముందు ఏం జరగబోతుంది అనేది ముందే తెల్సిపోతుంది ఇలా ఈ మూడు విషయాల్లో మాత్రం సినిమా టీమ్ కాస్త చూసుకుని ఉంటె జాను కి ఇప్పుడు వచ్చిన ఫలితం కంటే మెరుగయిన ఫలితం దక్కి ఉండేది .. ఇది రీమేక్ కావడంతో ఒరిజినల్‌ను చూసిన వారికి జాను ఆ సినిమా స్థాయిలో మాత్రం ఉండదు. అలా కాకుండా ఒక ఫ్రెష్ సినిమాగా చూసేవారికి మాత్రం నచ్చే అంశాలు చాలానే ఉన్నాయి.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *