Type to search

నేను ఒక మంచి తల్లిని కావాలనుకుంటున్నాను:శ్రుతీహాసన్

Box Office Latest News Trenging News

నేను ఒక మంచి తల్లిని కావాలనుకుంటున్నాను:శ్రుతీహాసన్

శ్రుతీహాసన్‌ ఓ గొప్ప నటుడి కూతురిగానే కాకుండా తనకంటూ ఓ ప్రత్యేక పేరును సంపాదించుకుంది . ఇటీవల తన లక్ష్యాల గురించి మాట్లాడుతూ జీవితంలో నేను సాధించాల్సింది ఎంతో ఉంది’’ అంటున్నారు శ్రుతీహాసన్‌. –‘‘కేవలం నటిగానే కాదు.. పాటలు, కవితలు రాయడం, సినీ నిర్మాణ రంగం పట్ల కూడా నాకు ఆసక్తి ఎక్కువగానే ఉంది. నా జీవితంలో నేను సాధించాల్సినవి ఇంకా చాలానే ఉన్నాయి. ఇందుకు చాలా సమయం కూడా ఉంది. కానీ భవిష్యత్‌లో నేను ఒక మంచి తల్లిని కావాలనుకుంటున్నాను. అదే నా అంతిమ లక్ష్యం. మంచి తల్లిగా ఉండటం మహిళల జీవితాల్లో ఓ గొప్ప విజయమని నా అభిప్రాయం’’ అని పేర్కొన్నారు. అయితే శృతి త్వరలో పెళ్లి చేసుకుంటుందేమో అని అనుకుంటున్నారు ప్రస్తుతం రవితేజ హీరోగా నటిస్తున్న ‘క్రాక్‌’ చిత్రంలో శ్రుతీహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ వల్ల ఈ సినిమా షూటింగ్‌ తాత్కాలికంగా నిలిచిపోయింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *