Type to search

నెగిటివ్ పాత్రలో నటించనున్న సమంత !

Box Office Latest News Trenging News

నెగిటివ్ పాత్రలో నటించనున్న సమంత !

 

పెళ్ళైన తర్వాత సమంత సెలెక్టవి గా సినిమాలను ఎంపిక చేసుకుంటుంది.కథల విషయంలో చాలా జాగ్రత్తలు వహిస్తూ తనకు సూటయ్యే పాత్రలను ఎంచుకుంటుంది. నాగ చైతన్యను పెళ్లాడిన తర్వాత ఈ ఇద్దరు కలిసి నటించిన మజిలీ మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత నందినిరెడ్డి దర్శకత్వంలో నటించిన ఓ బేబీ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఇక ఇటీవల వచ్చిన 96 రీమేక్ ,జాను మాత్రం నిరాశ పరిచిన సమంత నటనకు మంచి గుర్తింపు వచ్చింది. తాజాగా మరో సారి నందిని రెడ్డి దర్శకత్వంలో నటించనుందని
సమాచారం
సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా సమంత బిజీ అవుతుంది. ఫ్యామిలీ మ్యాన్ మొదటి పార్ట్ విజయవంతం కావడంతో దానికి సీక్వెల్ తెరకెక్కించాలని చూస్తున్నారు. ఇక మొదటి పార్ట్ లో సందీప్ కిషన్ , ప్రియమణి , మనోజ్ బాజ్పాయ్ నటించారు. ఇక ఈ సీక్వెల్ లో సమంత కూడా నటిస్తుందని తెల్సుతుంది. ఇక ఈ వెబ్ సిరీస్ స్పై థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది. ఇందులో సమంత నెగిటివ్ పాత్రలో నటిస్తుందని సమాచారం. అది ఒక టెర్రరిస్ట్ పాత్ర అని కూడా వార్తలు వస్తున్నాయి.అదే నిజమైతే మరి సమంత నెగిటివ్ పాత్రలో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *