Type to search

నిశ్శ‌బ్దంలో` సాక్షిగా అనుష్క

Box Office Latest News Trenging News

నిశ్శ‌బ్దంలో` సాక్షిగా అనుష్క

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం `నిశ్శ‌బ్దం`.హేమంత్ మధుకర్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, కోనవెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణంతా పూర్త‌య్యి ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఏప్రిల్ 2న ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో విడుద‌ల చేస్తున్నారు.
ఈ క్రాస్ జోన‌ర్ చిత్రంలో సాక్షి అనే వినూత్న పాత్ర‌లో అనుష్క మెప్పించ‌నున్నారు. అదే విధముగా మాధ‌వ‌న్‌, అంజ‌లి, షాలిని పాండే, సుబ్బ‌రాజ్‌, శ్రీనివాస్ అవ‌స‌రాల , మైకేల్ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో నటిస్తున్నారు. ఇటీవల విడుద‌లైన టీజ‌ర్ సినిమాపై ఉన్న అంచ‌నాల‌ను పెంచింది. ఈ చిత్రానికి సంగీతం గోపీ సుంద‌ర్ అందించారు.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *