Type to search

నిరాడంబరంగా నిర్మాత దిల్ రాజు రెండో పెళ్లి

Box Office Latest News Trenging News

నిరాడంబరంగా నిర్మాత దిల్ రాజు రెండో పెళ్లి

తెలుగు చిత్ర పరిశ్రమ బడా నిర్మాత దిల్ రాజు ఆదివారం రాత్రి రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.దిల్ రాజు మొద‌టి భార్య అనిత.. 2017లో అనారోగ్యం మరణించారు. ఈ ఘటన దిల్ రాజును మాన‌సికంగా బాగా క‌లిచివేసింది. ఇక అప్పటి నుండి ఒంటరిగా ఉంటున్న ఆయ‌న స‌న్నిహితుల ఒత్తిడి మేర‌కు రెండో పెళ్లి నిర్ణ‌యం తీసుకున్నారు గత కొన్ని నెలలుగా దిల్ రాజు రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు రూమర్స్ వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. వాటిని నిజం చేస్తూ ముందుగానే పెళ్లి ప్ర‌క‌ట‌న చేసిన ఆయ‌న‌… నిజామాబాద్‌లోని స్వగ్రామంలో తన ఇష్టదైవమైన వేంకటేశ్వరస్వామి గుడిలో ఆదివారం రాత్రి 11:30 గంటలకు పెళ్లి చేసుకున్నారు. అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో చాలా సింపుల్ గా ఈ పెళ్లి జరిగింది. అయితే ఈ పెళ్లికి తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌ నుంచి ఇద్ద‌రు బడా డైరెక్ట‌ర్లు అనిల్ రావిపూడి, హ‌రీశ్ శంక‌ర్ లు మాత్ర‌మే హ‌జ‌ర‌యిన‌ట్టు తెలుస్తోంది. వీరిద్ద‌రూ కూడా దిల్ రాజు అత్యంత ఆప్తుల‌న్న విషయం తెలిసిందే.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *