Type to search

‘నిన్నే పెళ్లాడతా’ సఖుడా పాట లిరిక్స్‌ సూపర్బ్” : మంచు లక్ష్మి

Box Office Latest News Trenging News

‘నిన్నే పెళ్లాడతా’ సఖుడా పాట లిరిక్స్‌ సూపర్బ్” : మంచు లక్ష్మి

హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తమ్ముడు అమన్‌ ప్రీత్‌ హీరోగా పరిచయం అవుతున్ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘నిన్నే పెళ్లాడతా’. అమన్‌ కు జోడీగా సిద్దికా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి వైకుంఠ్‌ బోను దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లతో పాటు తొలి పాటకు పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. తాజాగా ఈ చిత్రంలోని రెండో లిరికల్‌ వీడియో సాంగ్‌ను రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేసింది. ‘సఖుడా’ అంటూ సాగే ఈ పాటను నవనీత్‌ కంపోజ్‌ చేయగా చైతన్య ప్రసాద్‌ సాహిత్యం అందించాడు. చిన్మయి శ్రీపాద ఆలపించారు. సఖుడా చెలికాడా తెగువె కలవాడా సరదా వరదై రారా.. సఖుడా చెలికాడా సరసపు మొనగాడా మదిలో మదివై పోరా’ అంటూ సాగే ఈ ప్రేమ పాట యూత్‌ను ముఖ్యంగా లవర్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. నటి మంచు లక్ష్మి కూడా ఈ పాట తనను ఎంతగానో ఆకట్టుకుందని, లిరిక్స్‌ సూపర్బ్‌ అని ట్విటర్‌లో పేర్కొంటూ పాటకు సంబంధించిన లింక్‌ను షేర్‌ చేశారు. దీంతో ఈ పాట మరింత వైరల్‌ అయింది. ఇక ఈ చిత్ర టైటిల్‌ పోస్టర్‌ను కింగ్‌ నాగార్జున విడుదల చేయడంతో ‘నిన్నే పెళ్లాడతా’ పై మరింత అంచనాలు పెరిగాయి . ఈ చిత్రాన్ని . ఈశ్వరి, అంబిక ఆర్ట్స్ పతాకంపై బొల్లినేని రమ్య, వెలుగోడు శ్రీధర్‌బాబు నిర్మిస్తున్నారు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *