Type to search

నానీ తో జోడి కట్టనున్న ముగురు హీరోయిన్లు !

Box Office Latest News Trenging News

నానీ తో జోడి కట్టనున్న ముగురు హీరోయిన్లు !

‘నాని’ హీరోగా ‘జెర్సీ’ వంటి ఘనవిజయం అందించిన యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ మరోసారి ‘నాని’ హీరోగా ఓ చిత్రాన్ని చేస్తున్నారు. ‘టాక్సీ వాలా’ వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు ‘రాహుల్ సాంకృత్యన్’ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి ‘శ్యామ్ సింగ రాయ్’ టైటిల్ ఫిక్స్ చేసారు. సినిమా షూటింగ్ ప్రారంభంకు చాలా సమయం ఉన్నా కూడా హీరోయిన్స్ విషయం లో అప్పుడే చర్చలు దాదాపు గా ముగించేశాడు. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ కనిపించబోతున్నారట.ఇప్పటికే సాయి పల్లవిని ఒక హీరోయిన్ గా ఖరారు చేసారు . సాయి పల్లవి అధికారికం గా సైన్ చేయకున్నా కూడా తప్పకుండా నటిస్తానంటూ హామీ ఇచ్చిందట. మరో హీరోయిన్ పాత్ర కోసం రష్మిక మందన్న ను సంప్రదించ గా నో చెప్పిందట. రష్మిక నో చెప్పడంతో రాహుల్ తాజాగా మరో ఇద్దరు ముద్దుగుమ్మలతో చర్చలు జరిపాడట. తమిళ స్టార్ విజయ్ తో నటించి మెప్పించిన మాళవిక మోహన్ మరియు గూడాఛారి చిత్రంలో నటించిన శోభిత ధూళిపాల లు ఇద్దరు కూడా నానికి జోడీగా దాదాపుగా ఒకే అయినట్లే అంటూ చెప్పుకుంటున్నారు .

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *