Type to search

నాగబాబు కు కరోనా పాజిటివ్‌!

Box Office Latest News Trenging News

నాగబాబు కు కరోనా పాజిటివ్‌!

దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రోజు రోజుకు వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నప్పటికీ కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడం లేదు. సాధారణ ప్రజలతోపాటు ప్రముఖులు సైతం కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు, సెలబ్రెటీలు కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు. మరి కొందరు కరోనా ను జయించారు. ఇక తాజాగా నటుడు టవర్ స్టార్ నాగబాబు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ లో వెల్లడించారు. అంతే కాకుండా కరోనా నుండి త్వరగా కోలుకుని ప్లాస్మా దానం చేస్తానని పేర్కొన్నారు. కాగా నాగబాబు ట్వీట్ కు మెగా అభిమానులు పెద్ద ఎత్తున రిప్లయ్ ఇచ్చారు. మీరు త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నామని కామెంట్స్ చేశారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *