Type to search

నలుగురు అపరిచితుల ప్రయాణం .. దేనికోసం?

Box Office Latest News Trenging News

నలుగురు అపరిచితుల ప్రయాణం .. దేనికోసం?

హ్యాపీ వెడ్డింగ్‌తో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన యంగ్ హీరో సుమంత్ అశ్విన్‌‌. ప్ర‌స్తుతం గురు పవన్ దర్శకత్వంలో చిత్రం చేస్తున్నాడు . ఈ చిత్రంలో ప్రియా వ‌డ్ల‌మ‌ని క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా, శ్రీకాంత్‌, ఇంద్ర‌జ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. గురప్ప పరమేశ్వర ప్రొడక్షన్ నెం .1గా రాబోతున్న ఈ సినిమా  రామానాయుడు స్టూడియోలో ఘ‌నంగా ప్రారంభమైంది. ప‌లువురు ప్ర‌ముఖులు ఈ కార్య‌క్ర‌మంలో సంద‌డి చేశారు. ఈ సినిమాని నిర్మాత జి మహేష్ నిర్మిస్తున్నారు. సునీల్ కశ్య‌ప్‌ సంగీతాన్ని అందిస్తుండగా.. రామ్ ప్రసాద్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
నలుగురు స్ట్రేంజర్స్ వన్ డెస్టినీతో 3450 కి.మీ రైడ్ చేస్తే.. ఆ తరువాత జరిగే నాటకీయ పరిణామాలు ఎలా ఉంటాయి అనే అంశాలు చుట్టూ ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. వాళ్ల ప్రయాణం దేనికోసం.. ఆ ప్రయాణంలో వాళ్లు ఎదుర్కొన్న అనుభవాలేమిటి అనేది తెలుసుకోవాలంటే ఈ చిత్రం విడుదల కోసం ఆగాల్సిందే.

అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో దర్శకుడు గురుపవన్ మాట్లాడుతూ.. ‘‘మహేష్ మంచి టేస్ట్ ఉన్న నిర్మాత. భిన్న నేపథ్యాలు కలిగిన నలుగురు అపరిచితులు హైదరాబాద్ నుంచి బైకులపై చేసే ప్రయాణం ఈ సినిమా. ఏ కారణంతో వాళ్లు ఆ ప్రయాణం మొదలుపెట్టారు, వాళ్లు ఎలాంటి పరిస్థితులు, అనుభవాలు ఎదుర్కొన్నారనేది ఇందులోని ప్రధానాంశం. మార్చి 2న తొలి షెడ్యూలు ప్రారంభం అవుతుంది. మార్చి 22 నుంచి రెండో షెడ్యూలు జరుగుతుంది. హైదరాబాద్, ఝాన్సీ, నాగ్‌పూర్, గ్వాలియర్, మనాలి వంటి లొకేషన్లలో చిత్రీకరణ జరుపుతాం. రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ అవుతుంది’’ అని చెప్పారు.
హీరో సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని ఉత్సాహంతో ఎదురుచూస్తున్నా. శ్రీకాంత్, ఇంద్రజ వంటి ఫెంటాస్టిక్ యాక్టర్లతో పనిచేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది. ‘పెళ్లి సందడి’ సినిమా క్లైమాక్స్ చూసినప్పుడు నాకు గూస్ బంప్స్ వచ్చాయి. అప్పుడు నేను చాలా చిన్నవాడిని. ఇప్పుడు ఆ సినిమా హీరో శ్రీకాంత్ గారితో పనిచేస్తుండటం హ్యాపీ. ఇది మంచి సినిమా అవుతుంది’’ అన్నారు.
నటి ఇంద్రజ మాట్లాడుతూ.. ‘‘ఈ స్టోరీ చాలా డిఫరెంట్‌గా, వెరైటీగా ఉంది. నటనకు అవకాశం ఉన్న ప్రధాన పాత్ర చేస్తున్నా. మంచి పాత్రల కోసం ఎదురుచూస్తున్న నాకు ఒక ఫీస్ట్ లాంటి క్యారెక్టర్ ఇచ్చారు. తన కలలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నించే ఒక గృహిణిగా నటిస్తున్నా. రెండు రకాల లుక్స్‌లో కనిపిస్తా. సుమంత్ అశ్విన్ కెరీర్‌లో బాగా గుర్తుండిపోయే సినిమా అవుతుంది. శ్రీకాంత్, నేను ‘జంతర్ మంతర్’ సినిమాతో ఒకేసారి సోలో హీరో హీరోయిన్లుగా పరిచయమయ్యాం. ఇన్నాళ్లకు ఆయనతో మళ్లీ కలిసి పనిచేసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది’’ అని చెప్పారు.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *