Type to search

దాసరి కుటుంబంలో మరోసారి ఆస్తి చిచ్చు రంగంలోకి దిగిన చిరంజీవి

Box Office Latest News Trenging News

దాసరి కుటుంబంలో మరోసారి ఆస్తి చిచ్చు రంగంలోకి దిగిన చిరంజీవి

దివంగత దర్శకుడు దాసరి నారాయణ రావు కుటుంబంలో మరోసారి ఆస్తి చిచ్చు రాజుకున్న విషయం తెలిసిందే. అది కాస్త పోలీస్ స్టేషన్‌ వరకు వెళ్లడంతో.. మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగారు. ఈ ఇద్దరి అన్నదమ్ముల మధ్య సయోధ్య కుదుర్చే ప్రయత్నంలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా దాసరి నారాయణ రావు చిన్న కుమారుడు అరుణ్‌ ఈనెల 24న రాత్రి 10 గంటల సమయంలో తన ఇంట్లోకి చొరబడి తమపై దాడి చేశాడని పెద్ద కుమారుడు ప్రభు ఆరోపించారు. తాగిన మైకంలో నోటికి వచ్చినట్లుగా తిడుతూ.. తమపై చేయి చేసుకున్నాడని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించి తమ నాన్న బీరువా తెరిచేందుకు ప్రయత్నించారని, అడ్డుకున్న తమపై దాడికి దిగారని చెప్పారు. ఆస్తి కోసమే తమ తమ్ముడు అరుణ్ తనను వేధిస్తున్నాడని ప్రభు జూబ్లీ హిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాసరి అరుణ్ వెనుక ఉన్న కొందరు పెద్ద మనుషులే తమపై ఇలా దాడులు చేసేలా ప్రేరేపిస్తున్నారంటూ ప్రభు పలువురిపై అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో ఈ వివాదం ఫిలింనగర్‌ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఒకప్పుడు సినీ పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఉన్న దాసరి కుటుంబంలో ఇప్పుడు నెలకొన్న వివాదాలు ఆయన ప్రతిష్టకు మచ్చ తెచ్చేలా ఉన్నాయని దాసరి అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో శనివారం దాసరి కుమారులు ప్రెస్‌మీట్‌ పెట్టబోతున్నట్లు  సమాచారం

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *