Type to search

తాత అయిన రామ్ గోపాల్ వర్మ !

Box Office Latest News Trenging News

తాత అయిన రామ్ గోపాల్ వర్మ !

 

రామ్ గోపాల్ వర్మ అంటే పరిచయం అవసరం లేని పేరు. వివాదాస్పద దర్శకుడిగా ఫిల్మ్ ఇండస్ట్రి లో పేరు తెచ్చుకున్న రాము, పర్సనల్ విషయాలు పెద్దగా డిస్కస్ చేయడానికి ఇష్టపడడు. అయితే రామ్ గోపాల్ వర్మ కూతురు రేవతి సోమవారం ఉదయం పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. డాక్టర్ అయిన రేవతి 2013 లో హైదరాబాద్ కు చెందిన డాక్టర్ ప్రవీణ్ ను వివాహమాడింది. ఆ తరువాత ఆ జంట అమెరికా వెళ్ళి అక్కడే స్థిరపడ్డారు. ఇప్పుడు ఈ వార్త తో వర్మ కుటుంబ సభ్యులందరూ ఆనందం తో సంబరాలు జరుపుకుంటున్నారు.

ఇదే విషయం పై రామ్‌గోపాల్ వర్మను టీజ్ చేస్తూ.. రాజమౌళి ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ హాట్ టాఫిక్‌గా మారింది. రాజమౌళి రామ్ గోపాల్ వర్మ తాత అయిన విషయం పై ట్వీట్ చేస్తూ… ‘కంగ్రాట్స్ రామూ తాతయ్యగారూ… మీ మనవరాలు మిమ్మల్ని ఏలేంత గొప్పది అవ్వాలని కోరుకుంటున్నాను. ఇంతకీ మీరు ఎలా పిలిపించుకోవడానికి ఇష్టపడతారు? రాము తాతా, రాము నాన్న లేకపోతే గ్రాండ్‌పా రామూనా?’ అని ట్వీట్‌లో కామెంట్ చేశాడు. ఈ ట్వీట్‌కు వర్మను ట్యాగ్ చేశాడు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది. రామ్ గోపాల్ వర్మ దీనిపై ఎలా స్పందిస్తాడ అని నెటిజెన్లు వెయిట్ చేస్తున్నారు.

Tags:

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *