Type to search

తలైవి బయోపిక్ లో శోభన్ బాబు పాత్రదారి ఫిక్స్

Box Office Latest News Trenging News

తలైవి బయోపిక్ లో శోభన్ బాబు పాత్రదారి ఫిక్స్

గ్లామర్‌ రంగం నుంచి తమిళ రాజకీయ అరంగేట్రం చేసి దశాబ్దాల పాటు రాష్ట్ర రాజకీయాలను శాసించిన మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలితపై రూపొందుతోన్న బయోపిక్ లో బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ దివంగత జయలలిత బయోపిక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఫుల్ స్వింగ్ లో షూటింగ్ జరుపుకొంటున్న ఈ చిత్రం జూన్ 26న విడుదల కానుంది. హిందీ, తెలుగు మరియు తమిళంతో పాటు పలు భాషలలో ఈ చిత్రం విడుదల అవుతుండగా ఈ చిత్రం పై భారీ అంచనాలున్నాయి. ఇక ఈ చిత్రం కోసం కంగనా డాన్స్, హార్స్ రైడింగ్ వంటి వాటిలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు.
కాగా తలైవి సినిమాలో మాజీ ముఖ్యమంత్రి, ఒకప్పటి స్టార్ హీరో ఎంజీ రామచంద్రన్‌ పాత్రలో (ఎమ్ జి ఆర్) అరవింద స్వామి చేస్తున్నాడు. ఐతే జయలలిత జీవితంలో గల ప్రముఖ వ్యక్తులలో శోభన్ బాబు ఒకరు. జయలలిత, శోభన్ బాబు మధ్య ప్రత్యేకమైన అనుబంధం వుందని అప్పట్లో టాక్. ఆ విషయాలను కూడా ఈ సినిమాలో చర్చించనుంది చిత్రబృందం. ఈ పాత్ర కోసం బెంగాలీ నటుడు జిష్షు సేన్ గుప్తా ను తీసుకున్నారట. శోభన్ బాబుగా జిష్షు సేన్ గుప్తా కనిపించనున్నాడని తెలుస్తుంది. ఇటీవల నాగ శౌర్య హీరోగా వచ్చిన అశ్వథామ చిత్రంలో సైకో విలన్ గా మంచి నటన కనబరిచాడు. ఇక తలైవి సినిమాకు ఏ ఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను విష్ణు వర్ధన్‌ ఇందూరి, శైలేష్‌ ఆర్‌ సింగ్‌తో కలిసి విబ్రీ మోషన్‌ పిక్చర్స్‌, కర్మ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్మెంట్‌ నిర్మిస్తున్నారు.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *