Type to search

తమన్ నోట “పింక్” మాట

Box Office Latest News Trending Videos

తమన్ నోట “పింక్” మాట

సంగీత దర్శకుడు తమన్‌ను ‘అల వైకుంఠపురము’లో సంగీతానికిగాను ప్రత్యేకంగా ప్రశంసించాడు పవన్ కళ్యాణ్. తాను ఎంతాగానో అభిమానించే పవన్ కళ్యాణ్ తనపై ప్రశంసలు కురింపించే సరికి ఉబ్బితబ్బిబైపోయాడు తమన్. ఈ క్రమంలో పవన్ తదుపరి సినిమాకు సంగీతం అందించడం చాలా సంతోషంగా ఉందని, తన నుంచి బెస్ట్ సంగీతాన్ని ఇచ్చేందుకు ప్రయత్నిస్థానని చెప్పుకొచ్చాడు. మరి ఆ చిత్రం పింక్ రీమేక్ అయివుంటుందని అనుకుంటున్నారు.కానీ ఈ విషయం పై పవన్ మాత్రం ఎలాంటి కామెంట్లు చెయ్యట్లేదు.గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ విషయంపై ఎంతో ఉత్సుక్తత నెలకొంది. పింక్ సినిమా రిమేక్ చేస్తున్నారని చేయడంలేదని ఇలా పలు వార్తలు చక్కర్లు కొడ్తున్నాయి. ఈ విషయంపై పవన్ కళ్యాణ్‌ను ఎన్నిసార్లు అడిగినా.. సమాధానం చెప్పకుండా దాటవేస్తూ వచ్చాడు.. అయితే ఈ రీ ఎంట్రీపై పలువురు అధికారికంగా సమాచారమిచ్చినా.. పవన్ ఈ విషయాన్ని ప్రకటించకపోవడం తో అభిమానులు ఈ తీపి కబురు కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలో తమన్ ఇలా చెప్పడం తో పింక్ మూవీ తో పవన్ రీ ఎంట్రీ పక్కా అని అరతమవుతోంది.

Tags:

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *