Type to search

డిస్కోరాజా’ బ్లాక్‌ బస్టర్‌ సెలబ్రేషన్స్‌

Box Office Latest News Trenging News

డిస్కోరాజా’ బ్లాక్‌ బస్టర్‌ సెలబ్రేషన్స్‌

ఆదివారం రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఇటీవలే విడుదలైన ‘డిస్కోరాజా’ చిత్రం హిట్ అయిన సంధర్భంగా ఫ్రీకింగ్‌ బ్లాక్‌ బస్టర్‌ సెలబ్రేషన్స్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ‘‘నేను చేసే ప్రతి సినిమా కొత్తగా ఉండాలని కోరుకుంటా. నిర్మాత రామ్‌ తాళ్లూరి కూడా అలాగే ఆలోచిస్తారు. రెగ్యులర్‌ చిత్రాలను ఆయన ఇష్టపడరు. అందుకే మా కాంబినేషన్‌ విభిన్నమైన సినిమా వచ్చింది. నా క్యారెక్టర్‌కు స్పందన అదిరింది. ఇతర హీరోల ఫ్యాన్స్‌ ఇచ్చిన సపోర్ట్‌ మరువలేను’’ అని రవితేజ అన్నారు.

రవితేజ హీరోగా, పాయల్‌ రాజ్‌పుత్‌, నభా నటేశ్‌ కథానాయికలుగా వి.ఐ.ఆనంద్‌ దర్శకత్వంలో రామ్‌ తాళ్లూరి నిర్మించిన చిత్రం ‘డిస్కోరాజా’. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని సక్సెస్స్ ను పురస్కరించుకొని జరిగిన సెలెబ్రేషన్స్ లో రవితేజ మాట్లాడుతూ ‘‘సైన్స్‌ ఫిక్షన్‌ కథతో నా తరహా కామెడీని జోడించి దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. బాబీ సింహా, సునీల్‌ పాత్రలకు స్పందన బావుంది. అతనికిది కొత్త పాత్ర’ అని అన్నారు. ‘‘రవితేజతో కలిసి చాలా సినిమాల్లో నటించాను. కానీ ఇది భిన్నమైన పాత్ర. నేను సినీ పరిశ్రమకు వచ్చిన తరువాత జీవితం లో మర్చిపోలేమీ పాత్రను ఈ చిత్రం లో ఇచ్చారు.” అని సునీల్‌ తెలిపారు. ‘‘రవితేజకు పుట్టినరోజు గిఫ్ట్‌గా మంచి సినిమా ఇచ్చామనే సంతృప్తి ఉంది. కలెక్షన్లు బావున్నాయి’’ అని రామ్‌ తాళ్లూరి అన్నారు. ‘‘రవితేజ ఎనర్జీ సినిమాను మరో మెట్టు ఎక్కించింది. నిర్మాత అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా, కెమెరా అసిస్టెంట్‌గా పని చేశారు. ఇలాంటి నిర్మాతలు పరిశ్రమకు అవసరం’’ అని దర్శకుడు వి.ఐ ఆనంద్‌ అన్నారు.
మే 8న వస్తున్న ‘క్రాక్‌’
రవితేజ పుట్టిన రోజు సంధర్భంగా రవితేజ, శ్రుతీహాసన్‌ జంటగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్న ‘క్రాక్‌’ చిత్రాన్ని మే 8న విడుదల చేస్తున్నట్లు నిర్మాత ఠాగూర్‌ మధు ప్రకటించారు. ఆదివారం రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలో రవితేజ లుక్‌ను విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది.ఈ చిత్రం చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.

Tags:

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *