Type to search

టీజర్ తోనే అదరగొట్టేస్తున్న ‘జాను ‘

Box Office

టీజర్ తోనే అదరగొట్టేస్తున్న ‘జాను ‘

యంగ్ హీరో శర్వానంద్, సమంత కలిసి నటిస్తున్న సినిమా చిత్రం ‘ జాను ‘టీజర్‌ తాజాగా విడుదల అయ్యింది. ఈ సినిమా.. టైటిల్‌తో పాటు ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేసింది చిత్రబృందం. తమిళ హిట్ ’96’కి రీమేక్‌గా ఈ సినిమా ను రూపొందిస్తున్నారు

టీజర్ టాక్: తమిళంలో ’96’ సినిమా చూసిన వారికి ఈ సినిమా ఎలా ఉండబోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాలోని ప్రతీ సీన్‌ని ‘జాను’ టీజర్‌లో దించేశారనే చెప్పాలి. స్కూల్లో ఇష్టాల దగ్గర నుంచి.. మళ్లీ వారు కలిసే సీన్ వరకూ చిన్న చిన్న బిట్స్ రూపంలో టీజర్‌ని చూపించారు. కాగా.. టీజర్‌లోని బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అలరించింది. విజువల్స్ ఎంతో ఆకట్టుకునేలా ఉన్నాయి. మధ్య మధ్యలో డైలాగ్స్ సూపర్‌గా అనిపించాయి.

శర్వా, సమంతల యాక్టింగ్‌ ప్రతి సీన్ లో మనసును హత్తుకునేలా ఉంది. ఇక ఈ జోడీ స్క్రీన్ పై ఎ ఎలా అలరిస్తుందో చూడాలి.. ఈ సినిమా కు ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాత.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *