Type to search

‘జాన్’ టైటిల్ ప్రభాస్ చిత్రానికి పెట్టడం లేదు

Box Office Latest News

‘జాన్’ టైటిల్ ప్రభాస్ చిత్రానికి పెట్టడం లేదు

 

బాహుబలి, సాహో చిత్రాల తర్వాత ప్రభాస్‌ క్రేజ్‌ ఖండాంతరాలు దాటింది. అయితే ‘సాహో’తర్వాత ‘జిల్‌’ఫేం రాధాకృష్ణ సినిమాలో ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ జానర్‌లో, ఇటలీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతుందని సమాచారం. ‘జాన్’ అనే వర్కింగ్ టైటిల్​తో ఈ సినిమా షూటింగ్ జరుపుకొంటోంది. అయితే వర్కింగ్‌ టైటిల్‌నే సినిమా టైటిల్‌గా డిసైడ్‌ అయినట్లు కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ మూవీ టైటిల్​ను మార్చేస్తారట

ఇప్పటికే జనాల్లోకి వెళ్లిపోయిన ఈ టైటిల్‌తో వెళితే సినీ అభిమానుల్లో అంత హైప్‌ క్రియేట్‌ అవదని చిత్ర యూనిట్‌ భావించిందట. ఈ సినిమాపై అభిమానుల్లో మరిన్ని అంచనాలు పెంచడానికి మరో డిఫరెంట్‌ టైటిల్‌ కోసం చిత్ర బృందం ఇప్పటికే అన్వేషణ మొదలుపెట్టిందట. ఇందుకోసం ప్రభాస్‌ అభిమానుల నుంచి కూడా సలహాలు తీసుకోనుందని సమాచారం. అయితే ప్రభాస్‌ కొత్త సినిమా పేరు ‘జాన్‌’ కాదని తెలియడంతో దిల్‌ రాజు తన సినిమా తమిళ 96 చిత్రానికి జాను పేరునే ఖరారు చేసేసారు.

Tags:

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *