Type to search

జాన్ కి చిక్కులు తెచ్చిన జాను

Box Office Latest News Trenging News

జాన్ కి చిక్కులు తెచ్చిన జాను

సాహో చిత్రం తరువాత రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమాను మొదలు పెట్టాడు ప్రభాస్. మొదట ఆ సినిమాకు జాన్ టైటిల్ అనుకున్నారు. అయితే ఇటీవలే జాను చిత్రం విడుదల కావడం తో ఎక్కడ ఈ రెండు టైటిల్స్ మధ్య ప్రేక్షకులు కన్ఫ్యూస్ అవుతారో అనే భయంతో ఈ చిత్రం టైటిల్ ను మార్చే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. చిత్రానికి జాన్ కాకుండా ఓ డియర్ అనే టైటిల్ ను పెట్టేందుకు చర్చలు జరుగుతున్నాయట.
ఈ చిత్రం షూటింగ్ గత ఏడాది కాలంగా సాగుతూనే ఉంది. భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా 2020 ఆరంభంలో వస్తుందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటి వరకు అటువంటి అప్డేట్స్ ఏవి చిత్ర యూనిట్ నుండి రాలేదు.

ఈ సినిమా విడుదల కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రం గురించి ఎటువంటి అప్ డేట్ లేకపోవడంతో ఎందుకు అప్ డేట్ రావడం లేదు అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ గందర గోళంలో ఉన్నారు.
షూటింగ్ ఏ దశలో ఉందనే విషయం పై క్లారిటీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు.

ఇక ఈ చిత్రంలో ప్రభాస్ కు జోడీగా పూజా హెగ్డేనటిస్తోంది. కృష్ణంరాజు కూడా కీలక పాత్ర లో కనిపించబోతున్నారు.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *