Type to search

జాను  సినిమా  “ప్రాణం.. నా ప్రాణం” విడుదల

Box Office Latest News Trenging News

జాను  సినిమా  “ప్రాణం.. నా ప్రాణం” విడుదల

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి సహజ నటి త్రిష జంటగా నటించిన ఎమోషనల్ లవ్ స్టోరీ అయిన 96 ను ఇప్పుడు ప్రముఖ నిర్మాత దిల్ రాజు గారు తెలుగులో పునర్నిర్మిస్తున్నారు. శర్వానంద్, సమంత హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకి ఇటీవలే “జాను” అనే టైటిల్ ను ఖరారు చేశారు. 96 సినిమా అంటే ఎక్కువ మందికి గుర్తు వచ్చేది ఆ సినిమాలో హిట్ అయిన కాదలే కాదలే పాట. ఇప్పటికీ ఎన్నో సంగీత వేదికలపై ఆ పాటను లైవ్ లో విన్నప్పుడు మన కళ్ళు తెలియకుండానే వర్షిస్తాయి. 1996 సంవత్సరంలో స్కూల్లో చదువుకున్న బ్యాచ్ గెట్ టు గెదర్ అయిన సందర్భంలో; అప్పుడు ఇష్టపడ్డ ఒక జంట మళ్లీ కలిస్తే ఎలా ఉంటుంది.? అనే కథాంశంతో 96 సినిమా రూపొందించారు.ఈ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద రికార్డులు సృష్టించింది..

ఇప్పుడు ఆ పాటకు తెలుగు వెర్షన్ అయిన “ప్రాణం.. నా ప్రాణం” అనే పాటను రిలీజ్ చేశారు. సాహిత్య సవ్యసాచి శ్రీమణి గారు రచించిన ఈ పాటను చిన్మయి , గౌతమ్ భరద్వాజ్ పాడారు. 96 మూవీ తమిళ వెర్షన్ మ్యూజిక్ డైరెక్టర్ గోవింద్ వసంత తెలుగులో కూడా ఈ సినిమాకు సంగీతం అందించారు. మరి తెలుగు వెర్షన్ కి సంబంధించి కథలో ఏమైనా మార్పులు చేశారా లేదంటే అలాగే తీశారా అన్న విషయం తెలియాల్సి ఉంది. తమిళం 96 వెర్షన్ కు డైరెక్షన్ చేసిన సీ. ప్రేమ్ కుమార్ గారు ఈ సినిమా తెలుగు వెర్షన్ కు సైతం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ అల్మోస్ట్ పూర్తయ్యింది. చిత్ర యూనిట్ ఈ చిత్రాన్ని ఫిబ్రవరి మొదటి వారం లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *