Type to search

జగ్గు భాయ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు!

Box Office Latest News Trenging News

జగ్గు భాయ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు!

 

ఒకప్పటి ఫ్యామిలీ కథానాయకుడు.. నేటి ప్రతినాయకుడు జగపతిబాబు పుట్టినరోజు ఈ రోజు. ప్రముఖ నిర్మాత వీరమాచినేనీ రాజేంద్రప్రసాద్ తనయుడు జగపతి బాబు. బాల నటుడిగా తమ బ్యానర్ లో పరిచయమయ్యారు జగపతి బాబు. 1989 లో హీరో గా ఇంట్రడ్యూస్ అయ్యారు జగపతి బాబు. మొదటి రెండు సినిమాలు ఫ్లాప్ అవ్వడం తో డీలా పడిన జగపతి బాబుకు వాళ్ళ నాన్నగారు ధైర్యం చెప్పి ఆయను ప్రోత్సహించారు. ఆర్ జి‌ వి, జగపతి బాబు కాంబినేషన్ లో వచ్చిన గాయం చిత్రం, ఎస్ వి కృష్ణ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన “శుభ లగ్నం” చిత్రాలు అతనిని హీరో గా నిలదొక్కుకునేటట్టు చేశాయి. ఆ తెరువాత వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం రాలేధు జగపతి బాబుకు. మరో 80 చిత్రాలు వరుసగా ఒక దాని తరువాత ఒకటి చేసుకుంటూ పోయాడు జగపతి బాబు. అలా హీరోగా 100కు పైగా సినిమాలు చేశాడు జగపతి బాబు. శోబన్ బాబు తరువాత ఇద్దరు హెరోయినెలతో ఎక్కువ సినిమాలు చేసిన హీరో జగపతి బాబు.
ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు జగపతి బాబు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య నటించిన “లెజెండ్” సినిమాతో విలన్ గా ఇంట్రోడ్యూస్ అయ్యారు జగపతి బాబు. ఆ తరువాత స్టైలిష్ విలన్ గా తెలుగు ఇండస్ట్రీలో స్థిరపడిపోయాడు జగపతి బాబు.
‘సాహో’ సినిమా తరువాత రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో నటిస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా పాన్ ఇండియా సినిమాలో విలన్ గా జగపతి బాబు కనిపించనున్నారని తెలుస్తుంది. దీనికోసం జగపతి బాబు పాత్రను చాలా డిఫరెంట్ గా మలిచినట్టు తెలుస్తుంది. ఆయన లుక్, డైలాగ్ డెలివరీ కూడా విలక్షణంగా వుంటాయని సమాచారం.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *