Type to search

చైతూ.. సాయి పల్లవిలకు డాన్స్ కాంపిటీషన్

Box Office Latest News Trenging News

చైతూ.. సాయి పల్లవిలకు డాన్స్ కాంపిటీషన్

చైతూ, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా #NC19. ఈ ముగ్గురి కాంబినేషన్ ఒక క్రేజీ కాంబినేషన్ అనే చెపాలి. శేఖర్ కమ్ముల – నాగ చైతన్య కాంబినేషన్లో వస్తోన్న మొదటి చిత్రం ఇది. ఇక చైతు-సాయిపల్లవి జోడీ కట్టడం కూడా ఇదే మొదటిసారి. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లోబ్వ్హారీ అంచనాలు నెలకొన్నాయి. నాగచైతన్య ‘మజిలీ’.. ‘వెంకీమామ’ విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు.

ఈ సినిమా ఒక లవ్ స్టోరీ. హీరో హీరోయిన్లు ఇద్దరూ ఒక డ్యాన్స్ కాంపిటీషన్లో కలుస్తారని .. అక్కడే ఒకరితో ఒకరు ప్రేమలో పడిపోతారని వినికిడి. అయితే ఈ డాన్స్ కాంపిటీషన్ ఎపిసోడ్ సినిమాకు కీలకం కాబట్టి చైతు తన డ్యాన్స్ తో ఇరగదీయాల్సి ఉంటుందని తెలుస్తోంది. సాయి పల్లవి ఓ మంచి డ్యాన్సర్ అనే విషయం అందరికీ తెలిసిందే. అలాంటి సాయిపల్లవితో పోటీ అంటే చైతుకు కష్టమేనేమో అనే సంశయం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.

మరి చైతూ సాయి పల్లవి పై ఈ కాంపిటీషన్ లో గెలుస్తాడా. ఇప్పటి వరకు ఏ సినిమాలోనూ తన డాన్స్ స్టెప్పులతో అంతగా స్పార్క్ తీసుకు రాలేకపోయిన చైతు ఈ చిత్రం లో తన పవర్ ఎంతో చూపిస్తాడా అనేది వేచి చూడాలి.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *