Type to search

చిరు సినిమాలో హీరోయిన్ ఎవరు?

Box Office Latest News Trending Videos

చిరు సినిమాలో హీరోయిన్ ఎవరు?

అపజయం ఎరుగని దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి తన 152వ చిత్రాన్ని చేస్తున్నారు. కేవలం 100 రోజుల్లోనే ఈ చిత్రాన్ని పూర్తి చేస్తానంటూ దర్శకుడు కొరటాల శివ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అందుకోసం ఈ చిత్రాన్ని చాలా వేగంగా చిత్రీకరణ చేస్తున్నాడు దర్శకుడు. చిరంజీవి గత ఏడాది సైరా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఆ చిత్రం మిశ్రమ స్పందన అందుకోవడం తో ఈ సినిమా పై అభిమానులకు భారీ అంచనాలున్నాయి.

ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే విషయంపై క్లారిటీ ఇంకా రాలేదు.ఇటీవలే ఈ చిత్రం కోసం చిరంజీవి మరియు రెజీనాలపై ఒక ఐటెం సాంగ్ చేసినట్లుగా ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తుంది. ఆ పాటలో చిరంజీవిని బ్యాలన్స్ చేస్తూ ఆయన స్థాయిలో రెజీనా డాన్స్ చేసి అందరికి షాక్ ఇచ్చింది అంటూ వార్తలు వచ్చాయి. మెగా 152లో ఐటెంగా రెజీనా అంటూ క్లారిటీ వచ్చింది కాని మెయిన్ హీరోయిన్ ఎవరు అనే విషయం పై మాత్రం ఇంకా ఎటువంటి క్లారిటీ సినీ యూనిట్ నుండి లేదు.

పలువురి పేర్లు పరిశీలించారంటూ వార్తలు వచ్చినా చివరకు త్రిష పేరు వద్ద వచ్చి ఆ వార్తలు ఆగాయి. చిరంజీవికి జోడీగా త్రిష నటించనున్నట్లుగా ప్రచారం జరిగింది. కాని ఆ విషయమై కూడా ఇంకా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. మెగా 152 పై ఉన్న అంచనాల నేపథ్యంలో చిరంజీవికి జోడీగా ఎవరు నటిస్తున్నారా అనే ఆసక్తి ప్రేక్షకుల్లోనే కాకుండా సినీ వర్గాల్లో కూడా కనిపిస్తుంది.
ఈ చిత్రానికి రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించడమే కాకుండా ఈ చిత్రం లో నటించనున్నారనే వార్త వినిపిస్తోంది. ఈ చిత్రం కోసం రామ్ చరణ్ 40 రోజులు కాల్ షీట్లు ఇచ్చారని కూడా సమాచారం.
కొరటాల శివ ఎంతటి ప్రతిభావంతుడైన దర్శకుడో తెలిసిన విషయమే. అయితే చిరంజీవి, కొరటాల కాంబినేషన్ లో ఇదే మొదటి చిత్రం. ఈ ఏడాది ఆగస్ట్ 14 నా ఈ చిత్రం విడుదల చేయాలనే ఆలోచనలో ఉంది చిత్ర యూనిట్. తాజాగా ఈ చిత్రం లో ప్రతి నాయకుడి పాత్ర కోసం మోహన్ బాబు ను సంప్రదించారని తెలుస్తోంది. ఆదే నిజం ఐతే ఇక చిరు అభిమానులకు పండగే.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *