Type to search

గోరేటి వెంకన్నను కలిసిన రేణు దేశాయ్!

Box Office Latest News Trenging News

గోరేటి వెంకన్నను కలిసిన రేణు దేశాయ్!

సినిమాల్లో నటించకపోయినా, బుల్లి తెరమీద కొన్ని షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ అభిమానులకు దగ్గరగా ఉండే రేణుదేశాయ్ సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ పోస్టులు పెడుతూ అభిమానులకు ఆనందాన్ని పంచుతారు. ఇక  రేణు దర్శకత్వ చేయాలనీ  ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. భర్తతో విడిపోయిన తర్వాత మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్ ‘ఇష్క్ వాలా లవ్’ అనే సినిమాకి దర్శకత్వం వహించింది. అంతేకాకుండా మంచి పాత్రలు వస్తే నటించడానికి రెడీగా ఉన్నానని ప్రకటించింది. రైతులపై సినిమా తెరకెక్కించాలని చూస్తున్నారు రేణు దేశాయ్ . ఇప్పటికే రైతులను కలిసి వారి సమస్యలను వారి జీవన విధానం పై ఓ ప్రోగ్రాం కూడా చేసారు. రేణు దేశాయ్ రైతులపై సినిమా తీస్తా అని చెప్పి ఏడాది దాటింది. ఈ నేపథ్యంలో అసలు రైతులపై సినిమా ఉంటుందా లేదా అన్న డౌట్ అందరిలో మొదలైంది. తాజాగా ప్రముఖ రచయిత గోరేటి వెంకన్నను కలిసిన రేణు దేశాయ్.. ఆయనతో పాటలు రాయించుకుంటున్నట్లు ప్రకటించింది. ఇప్పుడిప్పుడే సినిమాలు స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో ఆమె కూడా తన సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది.త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన అప్డేట్ వచ్చే అవకాశం ఉంది

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *