Type to search

గర్భిణీ మహిళలకు పండ్లను పంచిన అనసూయ !

Box Office Latest News Trenging News

గర్భిణీ మహిళలకు పండ్లను పంచిన అనసూయ !

ప్రముఖ యాంకర్ , నటి అనసూయ తన పుట్టినరోజు సందర్భంగా   కీసర మండలం లోని గర్భిణి స్త్రీలకు న్యూట్రిషన్ కిట్స్‌ని పంపిణీ చేశారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్  చేతుల మీదుగా దాదాపు 100 మంది గర్భిణీ మహిళలకు న్యూట్రిషన్ కిట్ల పంపిణీ చేసారు అనసూయ. గర్భిణీ మహిళలకు న్యూట్రిషన్ కిట్ల పంపిణీ చేయటానికి ముందుకు వచ్చిన యాంకర్ అనసూయ భారత్వజ్ ను సిపి మహేష్ భగత్ అభినందించారు. ఈ సందర్భముగా అనసూయ మాట్లాడుతూ మహిళలు గర్భిణీలుగా  ఉన్న సమయంలో వారికి ఇలా పండ్లు ఇవ్వడం, మా అదృష్టం గా భావిస్తున్నామని అన్నారు. అభిమానులనుండి అనసూయకు విషెస్ వెల్లువెత్తుతున్నాయి. రంగస్థలం సినిమాలో రంగమ్మత గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ ప్రస్తుతం మెగాస్టార్ ఆచార్య, కృష్ణవంశీ రంగమార్తాండ సినిమలో నటిస్తుంది. నటిస్తోంది . లాక్ డౌన్ కారణంగా జబర్దస్త్ షూటింగ్స్ కూడా నిలిచిపోయిన విషయం తెలిసిందే .

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *