Type to search

5 కోట్లు గెలిచాక సమస్యల లో కూరుకుపోయా!

Box Office Latest News Trenging News

5 కోట్లు గెలిచాక సమస్యల లో కూరుకుపోయా!

డబ్బులు అది కూడా కోట్లలో ఒకేసారి వచ్చి పడితే మనిషికి ఎలా ఉంటుంది ? ఆహా !ఇక జీవితం సుఖమయం అవుతుంది .ఎలాంటి కష్టాలు ఉండవు ఇక అంతా సంతోషాలు అనుకుంటాం. తన మేధస్సుతో కౌన్ బనేగా కరోర్ పతి షో లో 5 కోట్లను గెలిచిన సుశీల్ కుమార్ మాత్రం 5 కోట్లు గెలిచాక నేను చాలా కష్టాలను, సవాళ్ళను ఎదుర్కొన్నా , ఆఖరికి నా భార్య కూడా నాకు విడాకులు ఇవ్వడానికి సిద్ధమైందని చెప్పాడు. అసలు ఏమి జరిగిందో చూద్దాం….
బీహార్‌కి చెందిన సుశీల్ కుమార్. ఐదో సీజన్‌లో పాల్గొన్న సుశీల్‌..కౌన్ బనేగా కరోర్ పతి షో లో 5కోట్లను గెలుచుకున్నారు. అయితే అంత డబ్బులు సాధించినా.. అతడి జీవితం సాఫీగా సాగలేదట. నిజానికి చెప్పాలంటే అదొక చెత్త సమయమని, చాలా సవాళ్లను ఎదుర్కొవాల్సి వచ్చిందని అతడు తెలిపారు. ఈ మేరకు తన సోషల్ మీడియాలో సుశీల్‌ ఓ పోస్ట్ చేశారు.
”2015 నుంచి 2016 వరకు నా జీవితంలో చాలా క్లిష్టమైన సమయం. కౌన్ బనేగాలో నేను గెలిచిన తరువాత బీహార్‌లోని పలు ప్రోగ్రామ్‌లకు నన్ను ఆహ్వానించారు. ఇలా నెలలో 15 రోజులు నేను వాటికి హాజరయ్యేందుకు సరిపోయింది. ఆ సమయంలో నా చదువు కూడా గాడి తప్పింది. నా వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకునేందుకు చాలా మంది ఇంటర్వ్యూలు చేశారు. ఆ సమయంలో వారికి చెప్పాలని పలు బిజినెస్‌ల్లో పెట్టుబడులు పెట్టా. అందులో నష్టాలే ఎక్కువగా వచ్చాయి. ఆ తరువాత నలుగురికి సాయం చేయాలన్న ఆలోచనతో ప్రతి నెల రూ.50వేలు దానం చేసేవాడిని. ఎవరి మీద నమ్మకం కలగలేదు. నా వ్యక్తిగత జీవితంలోనూ ఇబ్బందులు ఎదుర్కొన్నా. నా భార్యతో విడాకుల వరకు వెళ్లా.

అదే సమయంలో కొన్ని మంచి సంఘటనలు కూడా జరిగాయి. ఢిల్లీలో కొన్ని స్టూడెంట్‌ గ్రూప్‌లను కలిశా. కొత్త విషయాలు తెలుసుకున్నా. ఆ సమయంలో సిగరెట్‌, ఆల్కాహాల్‌కి బాగా అలవాటు పడ్డా. సినిమాలంటే పిచ్చితో చాలా సమయం వాటిని చూసేందుకు కేటాయించేవాడిని. అంతేకాదు అప్పుడు సినిమాలపై ఆసక్తి పెరగడంతో ముంబయికి వెళ్లా. కొన్ని అడ్వర్టైజ్‌మెంట్‌లు చేశా. ఓ సినిమాకు స్క్రిప్ట్‌ని రాశా. దానికి 20వేలు వచ్చింది. అయితే ఇదంతా సాగుతున్నప్పుడే జీవితం అంటే ఏంటో తెలిసింది. మన మనసుకు నచ్చినట్లు ఉండటం నిజమైన సంతోషమనిపించింది. ప్రాచుర్యం పొందడం కంటే ఒక మంచి మనిషిగా జీవించడం వంద రెట్లు మంచిదని అనిపించింది. మనకు ఎంత కావాలో అంతే సంపాదించాలి అతి గా అర్థం లేని వాటికోసం పాకులాడకూడదు ,మన జీవితాన్ని అర్థవంతంగా సమాజానికి ఎంతోకొంత ఉపయోగపడేలా జీవించాలి, అందుకే వెనక్కి వచ్చి నాకు ఇష్టం వచ్చినట్లు జీవిస్తున్నా” అని తెలిపారు. సుశీల్ కుమార్ జీవితం లో జరిగిన సంఘటన , అతని అనుభవాలు చాలామందికి గుణపాఠం కావాలి .

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *