Type to search

కొత్త వ్యాపారంలోకి స్టైలిష్ స్టార్ !

Box Office Latest News Trenging News

కొత్త వ్యాపారంలోకి స్టైలిష్ స్టార్ !

కరోనా కారణంగా షూటింగ్ లకు బ్రేక్ పడింది. హీరోలు హీరోయిన్లు ఇంటి పట్టున ఉంటున్నారు. వెకేషన్లకు వెళ్లడానికి కూడా లేదు. అల వైకుంఠపురములో చిత్రంతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన అల్లు అర్జున్ ఈ ఫ్రీ టైమ్ ను తన తదుపరి బిజినెస్ ప్లానింగ్ కోసం వినియోగించుకుంటున్నట్టు తెలుస్తోంది. బన్నీ ప్రస్తుతం సుకుమార్ తో సినిమాను మొదలు పెట్టాల్సి ఉంది. అది వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చి చివరికి మార్చ్ సెకండ్ హాఫ్ లో షూటింగ్ కు వెళ్తుంది అఅనుకుంటూ ఉండగా కరోనా ఎఫెక్ట్ తో అది కూడా ఆగిపోయింది. ఈ వైరస్ తగ్గి పరిస్థితులు మాములుగా మారాక ఈ చిత్ర షూటింగ్ మొదలవుతుంది.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పలు వ్యాపారాలలో భాగస్వామి అనే విషయం తెల్సిందే. డైరెక్ట్ గా కాదు కానీ బన్నీకి హైదరాబాద్ లోని పలు పబ్స్ లో వాటాలున్నాయి. అలాగే అల్లు అరవింద్ పెట్టిన ఆహా యాప్ ను బన్నీ ప్రమోట్ చేస్తున్నాడు. దీనికి విడిగానే పారితోషికం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ పూర్తవ్వగా ఇప్పుడు పరిస్థితులు బాలేని కారణంగా దాన్ని టెలికాస్ట్ చెయ్యట్లేదు.
తాజా సమాచారం ప్రకారం అల్లు అర్జున్ మరో కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. ఒక ప్రముఖ కార్ల కంపెనీతో బన్నీ డీల్ సెట్ చేసుకున్నాడట. అందులో పార్ట్నర్ షిప్ తీసుకున్నాడని తెలుస్తోంది. ఈ కార్ల కంపెనీకి ఫ్రంట్ ఫేస్ గా బన్నీనే ఉంచనున్నారు. త్వరలో దీనికి సంబంధించిన షోరూమ్ ఓపెనింగ్ కూడా జరగనుంది అని టాక్ వినిపిస్తోంది

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *