Type to search

కొణిదెల బ్యానర్ పై విమర్శలకు చెక్ పెట్టిన చరణ్

Box Office Latest News Trenging News

కొణిదెల బ్యానర్ పై విమర్శలకు చెక్ పెట్టిన చరణ్

కొణిదెల ప్రొడక్షన్ కంపెనీపై వరుసగా తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి హీరోగా సినిమాలు నిర్మిస్తూ వచ్చారు మెగా పవర్ స్టార్ రామ్ రామ్ చరణ్. .. ఈ బ్యానర్ లో `ఖైదీ నెంబర్ 150` అటుపై భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ `సైరా నరసింహారెడ్డి`ని నిర్మించి బ్లాక్ బస్టర్ అందించారు రామ్ చరణ్. ప్రస్తుతం కొణిదెల బ్యానర్ మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి చిరు 152వ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మలయాళం నుంచి “లూసీఫర్” డ్రైవింగ్ లైసెన్స్` చిత్రాల రీమేక్ రైట్స్ ని కొణిదెల అధినేత చరణ్ దక్కించుకున్నారు.. ఈ రీమేక్ లలో హీరోలు ఎవరు? అన్నది ఖరారు కావాల్సి ఉంది. అయితే లూసీఫర్ ఒరిజినల్ లో యాక్ట్ చేసిన మోహన్ లాల్ పాత్ర చిరంజీవి చేస్తారనే టాక్ ఉంది. పరశురామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. రీమేక్ రైట్స్ తీసుకుని వాటిలో హీరోల్ని ప్రకటించకపోవడంతో బయట హీరోలతో చరణ్ సినిమాలు చేయరా? అన్న కొన్ని విమర్శలు వినిపించాయి. ఈ నేపథ్యంలో చరణ్ వాటికి చెక్ పెట్టే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. తొలిగా చిరంజీవికి సమకాలికుడైన విక్టరీ వెంకటేష్ హీరోగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ తొలి సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది.

అయితే వెంకీ కోసం ఎలాంటి స్క్రిప్ట్ ఫైనల్ చేసారు? దర్శకుడు ఎవరు? అన్న వివరాలు మాత్రం ఇంకా తెలియలేదు. `డ్రైవింగ్ లైసెన్స్` రీమేక్ లో వెంకటేష్ నటించే వీలుందన్న టాక్ ఫిమ్ నగర్ లో చక్కర్లు కొడ్తోంది. మరి చరణ్ మైండ్ లో ఏముందో తెలియాలి

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *