Type to search

కేజీఎఫ్ 2 ‘అధీరా’ లుక్ లీక్ అయిందా ?

Box Office Latest News Trenging News

కేజీఎఫ్ 2 ‘అధీరా’ లుక్ లీక్ అయిందా ?

 

ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో కన్నడ స్టార్ యష్ నటించిన చిత్రం ‘కేజీఎఫ్’. బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. బాలీవుడ్ లోనూ సత్తా చాటింది. రిలీజ్ అయినా ప్రతిచోట మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడీ కేజీఎఫ్ 2 తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే.ఫస్ట్ పార్ట్ ను నిర్మించిన హోమబుల్ ఫిలిమ్స్ ఈ పార్ట్ ను కూడా నిర్మిస్తుంది. ఈ సంవత్సరం చివర్లో కేజీఎఫ్ 2 రిలీజ్ కానుంది. ఈ సినిమా లో పలువురు బాలీవుడ్ నటీనటులు నటిస్తున్నారని సమాచారం. ఇప్పటికే బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ‘అధీరా’ గా నటిస్తున్నాడని క్లారిటీ వచ్చింది .రవీనా టాండన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే తాజాగా ‘అధీరా’ లుక్ అంటూ సోషల్ మీడియాలో ఓ ఫోటో చక్కర్లు కొడుతుంది. ఈ ఫొటోలో పవర్ ఫుల్ లుక్ లో కనిపిస్తున్నాడు సంజయ్. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆ ఫొటోను విరివిగా షేర్ చేస్తూ వైరల్ చేసేశారు.లేటెస్టుగా బయటకి వచ్చిన సంజయ్ దత్ లుక్ ‘కేజీఎఫ్ 2’లోనిదా..? కాదా..? అన్నది మాత్రం మూవీ యూనిట్ అధికారికంగా
ప్రకటించాల్సి ఉంది

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *