Type to search

కామెడీతో కుటుంబాన్ని అలరిస్తూఉంటారు మహేష్ : నమ్రత

Box Office Latest News Trenging News

కామెడీతో కుటుంబాన్ని అలరిస్తూఉంటారు మహేష్ : నమ్రత

 

కోరలు చాచుతున్న కరోనాను కట్టడి చేసేందుకు లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. ఈ సమయం లో సినిమా షూటింగ్‌లన్నీ వాయిదా పడటంతో సెలబ్రిటీలంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు. లాక్‌డౌన్‌ కాలంలో ఇంట్లో సరదాగా గడుపుతున్న ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. ఇలాంటి సమయం లో మహేష్‌కు గురించి ఓ ఆసక్తికర విషయాన్ని ఆయన భార్య నమ్రతా శిరోద్కర్‌ చెప్పారు . మహేష్‌ తన కామెడీతో కుటుంబాన్ని అలరిస్తూ ఉంటారని చెపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు. ‘లాక్‌డౌన్‌ సమయంలో ఇంట్లోనే సురక్షితంగా ఉండండి. సామాజిక దూరం పాటించండి. ఈ సమయంలో మహేష్‌ తన అద్భుతమైన హాస్యంతో మా పెదాలపై చిరునవ్వు అందిస్తున్నాడు. అతడు మా రాక్‌ సాలిడ్‌ హాఫ్‌. అతన్ని పూర్తిగా ప్రేమిస్తున్నాను’ అంటూ వెల్లడించారు నమ్రత .కరోనాను ఎదుర్కొనేందుకు మహేశ్‌ కూడా పలు సూచనలు చేయడంతోపాటు తన వంతు బాధ్యతగా కోటి రూపాయలు విరాళం కూడా ప్రకటించారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *