Type to search

కరోనా మాస్క్ తో ‘క్రష్ ‘మూవీ ప్రమోషన్!

Box Office Latest News Trenging News

కరోనా మాస్క్ తో ‘క్రష్ ‘మూవీ ప్రమోషన్!

తెలుగు లో ప్రయోగాత్మకమైన చిత్రాలను రూపొందించడం లో నటుడు, దర్శకుడు రవిబాబు కు మంచి పేరుంది .సినిమా హిట్ అయినా ఫలపు అయినా కోడ్ ఫలితాలతో సంబంధం లేకుండా, ప్రయోగాలను వదిలిపెట్టకుండా వైరైటీ కాన్సెప్ట్‌ చిత్రాలతో దర్శకుడిగా తనదైన ముద్ర వేసుకున్నాడు. ‘ఆవిరి’ చిత్రం తర్వాత రవిబాబు లేటెస్ట్ గా చేస్తున్న చిత్రం ‘క్రష్‌’. షూటింగ్‌ తుది దశకు చేరుకున్న ఈ చిత్రం వేసవి కానుకగా విడుదల కానుంది. దీంతో మూవీ ప్రమోషన్స్‌ను చిత్ర బృందం ప్రారంభించింది. దీనిలో భాగంగా చిత్రానికి సంబంధించిన మరో రెండు పోస్టర్లను మూవీ యూనిట్‌ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తున్న ‘కరోనా వైరస్‌’వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి మాస్క్‌లు ధరించాలంటూ సూచిస్తూ వినూత్న ఫోటోలను రూపొందించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి . ‘కు కరోనా వైరస్‌ను కూడా ఉపయోగించుకుని సినిమా ప్రమోషన్స్‌ కోసం వాడుకోవచ్చిని రవిబాబుకు మాత్రమే తెలుసు’అంటూ ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. ఈ చిత్రాన్ని తన సొంత బ్యానర్ ఫ్లయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్స్‌పై రవిబాబు ఈ సినిమా ను నిర్మిస్తున్నారు.

Tags:

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *