Type to search

కరోనా ఎఫెక్ట్ :తన ఇంటిని పూర్తిగా కవర్లతో కప్పిన హీరో

Box Office Latest News Trenging News

కరోనా ఎఫెక్ట్ :తన ఇంటిని పూర్తిగా కవర్లతో కప్పిన హీరో

బాలీవుడ్‌ను కరోనా వైరస్‌ వదలడం లేదు. సింగర్‌ కనికా కపూర్  మొదలుకొని నిర్మాత కరీం మోరాని, ఆయన కూతుళ్లు, నిర్మాత బోని కపూర్‌ ఇంట్లో సహాయకులు.. ఇలా పలువురికి కరోనా సోకిన సంగతి తెలిసిందే. తాజాగా  అమితాబ్ , అభిషేక్,ఐశ్వర్య ఆమె కూతురు ఇలా బిగ్ బి కుటుంబం కూడా కరోనా బారిన పడింది. మరికొందరి సెలబ్రెటీల సిబ్బంది కూడా కరోనా బారిన పడుతున్నారు. దాంతో సెలబ్రెటీలంతా భయాందోళనకు గురవుతున్నారు . చాలా మంది బయటకు రావడానికే వణికిపోతున్నారు. ఈ క్రమంలో ఇంట్లోనే ఉంటూ తగిన జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ మాత్రం సరికొత్త ఆలోచన చేశాడు. తన ఇంటిని పూర్తిగా కవర్లతో కప్పి ఉంచాడు. గాలి కూడా దూరే అవకాశం లేకుండా జాగ్రత్త చర్యలు తీసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *