Type to search

కంగనాకు వై కేటగిరి భద్రత ఎందుకు ? ప్రకాష్ రాజ్ ప్రశ్న

Box Office Latest News Trenging News

కంగనాకు వై కేటగిరి భద్రత ఎందుకు ? ప్రకాష్ రాజ్ ప్రశ్న

కంగనాపై బాహుభాషా నటుడు, రాజకీయ విమర్శకుడు ప్రకాశ్‌ రాజ్‌ ఘాటు విమర్శలు ఎక్కుపెట్టాడు. తనకు ఎన్ని అడంకులు ఎదురైనా తలదించకుండా ఝాన్సీ లక్ష్మీభాయ్‌లా ముందుకు వెళ్తానంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించాడు. భారతీయ చిత్రపరిశ్రమలో ఎంతోమంది వీరుల పాత్రలు పోషించారని ఒక్క సినిమాతోనే (కంగనా) ఝాన్సీ లక్ష్మీభాయ్‌ అయిపోయినట్లు అనుకోకని కౌంటర్‌ ఇచ్చాడు. అంతేకాకుండా కంగనాకు వై కేటగిరి భద్రత కల్పించడంపై కూడా ప్రకాశ్‌ రాజ్‌ గట్టిగా బదులిచ్చాడు. లాక్‌డౌన్‌ సమయంలో ఎర్రటి ఎండలో నడిరోడ్డుపై వలస కార్మికులు పొట్టచేతపట్టుకుని నడుచుకుంటూ పోతుంటే వారికి లేని భద్రత.. ఓ నటికి ఎందుకని ప్రశ్నించాడు. ఈ మేరకు తన ట్విటర్‌ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్‌ చేశాడు. అవునూ ఇది కొత్త భారతం అంటూ కామెంట్‌ సైతం పెట్టాడు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *