Type to search

“ఒక పెద్ద అల్లికల మాస్టర్ కథే “అల్లు”: ఆర్జీవీ

Box Office Latest News Trenging News

“ఒక పెద్ద అల్లికల మాస్టర్ కథే “అల్లు”: ఆర్జీవీ

కరోనా ఉదృతి నేపథ్యంలో దర్శకులు షూటింగ్ లు మొదలు పెట్టడానికే జంకుతుంటే ఆర్జీవీ మాత్రం ఒకదానితరవాత మరొక ప్రాజెక్ట్ ప్రకటిస్తూ దూసుకుపోతున్నారు. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను ప్రకటించాడు. “అల్లు” అనే ఫిక్ష‌న‌ల్ సినిమాను తెరకెక్కిస్తానని సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. సినిమాలో ఓ స్టార్ హీరో కుటుంబం కోసం అతడి బామ్మర్ది ఏం చేసాడో చూపిస్తానని అన్నారు. అయితే “జనరాజ్యం” పార్టీ స్థాపనతో ఈ కథ మొదలవుతుందని పేర్కొన్నారు. ఈ సినిమాకు అల్లు అని పెట్ట‌డానికి కార‌ణాన్ని కూడా తెలిపారు. చిత్రంలోని ప్ర‌ధాన పాత్ర‌ ర‌కార‌కాల ప్లాన్స్ అల్లుతూ ఉంటాడని, అందుకే సినిమాకు ఆ పేరు పెట్టామ‌న్నారు. “అందరితో తనని “ఆహా” అనిపించుకోవటానికి తనకి కావాల్సిన వాళ్ళకే  మంచి జరిగేలా చెప్పి ప్లాన్ ల మీద ప్లాన్ అల్లుకుపోతూ ఉండే  ఒక పెద్ద అల్లికల మాస్టర్ కథే ఈ “అల్లు”…అంటూ ట్వీట్ చేసారు. ఈ చిత్రంలో పాత్రలను కూడా ఆర్జీవీ ప్రకటించాడు. సినిమాలో ఎ.అర‌వింద్‌, కె.చిరంజీవి, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, ఎ.అర్జున్‌, ఎ.శిరీష్‌, కె.ఆర్‌.చ‌ర‌ణ్‌, ఎన్.‌బాబు త‌దిత‌రులు ఉంటార‌ని తెలిపారు.    ఇటీవలే “పవర్ స్టార్” సినిమాతో వివాదానికి తెరలేపిన ఆర్జీవీ “. షూటింగ్ లను త్వరగా పూర్తి చేస్తూ తన యాప్ లో విడుదల చేస్తున్నాడు కూడా.అల్లు” సినిమాతో ఎలాంటి వివాదాలకు తెరలేపుతారో చూడాలి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *