Type to search

“ఐ ల‌వ్ యూ..” చిరు.. నీకు ఎన్నో విష‌యాలు చెప్పాల‌నుంది”

Box Office Latest News Trenging News

“ఐ ల‌వ్ యూ..” చిరు.. నీకు ఎన్నో విష‌యాలు చెప్పాల‌నుంది”

 

క‌న్న‌డ హీరో చిరంజీవి స‌ర్జా హ‌ఠాన్మ‌ర‌ణం నుంచి అత‌ని కుటుంబం ఇంకా కోలుకోలేపోతోంది. అత‌డు ఈ లోకం నుంచి నిష్క్ర‌మించాడ‌న్న‌ విష‌యాన్ని ఇప్ప‌టికీ జీర్ణించుకోలేక‌పోతున్నారు. గురువారం చిరంజీవి స‌తీమ‌ణి మేఘ‌నా రాజ్‌ సోషల్ మీడియా లో భావోద్వేగ లేఖ పంచుకున్నారు. ”
“న‌న్ను ఎంత‌గానో ప్రేమించావు.. ఎప్ప‌టికీ నా చేయి వ‌ద‌ల‌నంటూ మాటిచ్చావు. కానీ ఏం చేశావు? మ‌న ప్రేమ‌కు గుర్తుగా నాకు పాపాయిని ఇవ్వ‌నున్నందుకు నీకు చిర‌కాలం కృతజ్ఞ‌త‌లు తెలుపుతూనే ఉంటాను. నా బిడ్డ‌గా నిన్ను మ‌ళ్లీ భూమిపైకి తీసుకువ‌చ్చేందుకు నేను త‌హ‌త‌హలాడుతున్నాను. నీతో క‌లిసి బ‌తికేందుకు ఎదురు చూస్తున్నాను. నీ న‌వ్వు చూసేందుకు నేనాగ‌లేకున్నా.. నీ న‌వ్వుల‌తో గ‌దంతా వెలుగులు విర‌జిమ్మ‌డం కోసం ఎదురుచూస్తున్నా.. నేను నీకోసం ఎదురుచూస్తుంటా.. అలాగే నువ్వు నాకోసం ఎదురుచూస్తూ ఉండు.. నా ఊపిరి ఆగిపోయేవ‌ర‌కు నువ్వు బ‌తికే ఉంటావు. ఎందుకంటే నువ్వు నాలోనే ఉన్నావు. ఐ ల‌వ్ యూ..” చిరు.. నీకు ఎన్నో విష‌యాలు చెప్పాల‌నుంది. కానీ ఎంత ప్ర‌య‌త్నించినా దాన్ని మాట‌ల్లో వ‌ర్ణించ‌లేక‌పోతున్నాను. నువ్వు నాకు ఎంత ముఖ్య‌మ‌నేది ప్ర‌పంచ‌లో ఏదీ వ‌ర్ణించ‌లేదు. స్నేహితుడిగా, ప్రేమికుడిగా, జీవిత భాగ‌స్వామిగా, చంటి పిల్లాడిగా, నా ధైర్యంగా, నా భ‌ర్త‌గా.. అస‌లు వీట‌న్నింటి క‌న్నా ఎక్కువ. నువ్వు నా ప్రాణం. కానీ అర్థం కాని బాధ న‌న్ను ప్ర‌తీక్ష‌ణం చిత్ర‌వ‌ధ చేస్తోంది. నువ్వు లేవ‌ని గుర్తొస్తున్న ప్ర‌తిక్ష‌ణం నా మ‌న‌సు కుంగిపోతుంది. వేలాది చావులు చూస్తున్నంత న‌ర‌కంగా ఉంది. కానీ నా చుట్టూరా ఏదో మ్యాజిక్ మంత్రం వేసిన‌ట్లు అనిపిస్తోంది. నేను దిగులుప‌డ్డ ప్ర‌తిసారి న‌న్ను సంర‌క్షించేందుకు నువ్వు నా చుట్టూనే ఉన్నావ‌నిపిస్తోంది.” అంటూ పోస్ట్ చేసారరు . చిరంజీవి స‌ర్జా 2018 మే 2న మేఘ‌నా రాజ్‌ను పెళ్లి చేసుకున్నారు ప్ర‌స్తుతం ఆమె గ‌ర్భ‌వ‌తి. కాగా చిరంజీవి స‌ర్జా జూన్ 7న గుండెపోటుతో మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *