Type to search

ఈ నెల 21న ‘ప్రెషర్‌కుక్కర్‌’ విడుదల

Box Office Latest News Trenging News

ఈ నెల 21న ‘ప్రెషర్‌కుక్కర్‌’ విడుదల

సాయి రోనాక్, ప్రీతి అస్రాణి హీరో హీరోయిన్లు గా తెరకెక్కిన చిత్రం ‘ప్రెషర్‌కుక్కర్‌’. దర్శకద్వయం సుజోయ్‌, సుశీల్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదలకానుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో సుజోయ్‌, సుశీల్‌ పాత్రికేయులతో ముచ్చటించారు.

కుటుంబ విలువలు, భావోద్వేగాల ప్రధానంగా సాగే సెటైరికల్‌ ఎంటర్‌టైనర్‌ మా జీవితాలతో పాటు సమాజంలో మేము చూసిన వాస్తవ ఘటనల నుంచి స్ఫూర్తి పొంది ఈ సినిమాను తెరకెక్కించాం’ అని అన్నారు. ఈ చిత్రానికి అప్పిరెడ్డి నిర్మాత.
చదువులు, ర్యాంకుల పేరుతో యువతరంపై ఒత్తిడి పెరుగుతున్నది. విద్యాభ్యాసం పూర్తయిన వెంటనే పిల్లల్ని విదేశాలకు పంపించాలనే సంస్కృతి పెరిగింది. అలాంటి ఒత్తిడిలతో నిరంతరం సతమతమయ్యే ఓ మధ్య తరగతి యువకుడి కథ ఇది.ఈ క్రమంలో అతడు ఎలాంటి సంఘర్షణను ఎదుర్కొన్నాడు? తన కలల్ని వీడి మరో దారిలో అతడు ఎందుకు ప్రయాణించాల్సివచ్చింది? అనే అంశాన్ని వినోదాత్మక పంథాలో ఈసినిమాలో ఆవిష్కరించాం.
విదేశాల్లో స్థిరపడిన పిల్లల కారణంగా వృద్ధాప్యంలో అసరా లేక తల్లిదండ్రులు ఎలాంటి కష్టాల్ని ఎదుర్కొంటారోననే సందేశాన్ని అంతర్లీనంగా చూపించాం. స్వదేశంలో ఉంటూ జీవితంలో గెలవవచ్చునని ఓ యువకుడు ఎలా నిరూపించడాన్నది స్ఫూర్తివంతంగా ఉంటుంది. హితభోద చేసినట్లుగా కాకుండా వ్యంగ్యాస్త్రంగా ఈ సినిమాను రూపొందించాం. ప్రథమార్థం ఆహ్లాదభరితంగా ఉంటుంది. ద్వితీయార్థం ఎమోషనల్‌గా సాగుతుంది.
కథ నచ్చడంతో అభిషేక్‌ పిక్చర్స్‌ వారు సినిమా విడుదలచేయడానికి ముందుకొచ్చారు. కంటెంట్‌ ఈజ్‌ కింగ్‌!
ప్రస్తుతం తెలంగాణ నేపథ్య కథాంశాలతో సినిమాల్ని తెరకెక్కించే ట్రెండ్‌ పెరిగింది. ఆ ఫార్ములాను ఫాలో అవుతూ విజయాన్ని అందుకోవాలని అనుకోలేదు. తెలంగాణలోనే పుట్టిపెరిగాం. నిజజీవితంలో మేము తెలంగాణ యాసతోనే మాట్లాడుతుంటాం. మాకు తెలిసిన భాషలోనే సినిమా చేయాలనే తెలంగాణ నేపథ్యాన్ని ఎంచుకున్నాం. ప్రేక్షకుల అభిరుచులు మారుతున్నాయి. కంటెంట్‌ఈజ్‌ కింగ్‌ అనే భావన బలపడింది. మంచి సినిమా చేస్తే ఆదరిస్తారనే నమ్మకంతో రూపొందించాం అని తెలిపారు.
ఈ చిత్రం లో రాహుల్ రామ కృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు. సునిల్ కశ్యప్, రాహుల్ సిప్లిగంజ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *