Type to search

ఆర్జీవీ చేస్తున్న దానికి బాధపడ్డా : రామజోగయ్య శాస్త్రి

Box Office Latest News Trenging News

ఆర్జీవీ చేస్తున్న దానికి బాధపడ్డా : రామజోగయ్య శాస్త్రి

సంచలన  దర్శకుడు రాంగోపాల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బయోపిక్ నిర్మించనున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే, ఆయన రక్త చరిత్ర, లక్ష్మీస్ ఎన్టీఆర్ వంటి పలు సినిమాలను నిజజీవిత కథల ఆధారంగా తీసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వర్మ మారుతీ రావు, అమృత, ప్రణయ్ ప్రేమకథ, హత్యల సంఘటనలను ఆధారంగా చేసుకుని మర్డర్ పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. దీనిపై అమృత ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేసింది కూడా.. తాజాగా ఆర్జీవీ  పవన్ సినిమా ప్రకటించడంతో సీనియర్ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి తీవ్రంగా హర్ట్ అయ్యారట..రామజోగయ్య శాస్త్రి ట్విట్టర్ లో తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఆర్జీవీ చేస్తున్న దానికి బాధపడ్డానని తెలిపారు. తన కాలేజీ రోజుల్లో శివుడిని ఆరాధించాక ఆర్జీవీని .. మణిరత్నంని అంతగా ఆరాధించేవాడినని చెప్పారు. “అయితే మీరు ఈ రోజుల్లో మీకు కావలసినది చేస్తున్నారు” అని తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *