Type to search

ఆది పినిశెట్టి ఆ హీరోయిన్ తో లవ్ లో ఉన్నారా !

Box Office Latest News Trending Videos

ఆది పినిశెట్టి ఆ హీరోయిన్ తో లవ్ లో ఉన్నారా !

గత కొద్దికాలంగా హీరో ఆది పినిశెట్టి ప్రేమలో పడ్డారు అనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. మలుపు, మరకతమణి చిత్రాల్లో ఆది తో కలిసి నటించిన నిక్కీ గర్లానీ తో ఆది ప్రేమలో ఉన్నట్టు కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. కాగా ఇప్పుడు ఆది తండ్రి పుట్టినరోజుకు నిక్కీ హాజరవ్వడంతో సినీవర్గాల్లో చర్చ మొదలయ్యింది.అంతే కాకుండా ఇటీవల పలు ఇంటర్వ్యూ లలో కూడా ఆదిని పెళ్లిగురించి అడిగితే త్వరలోనే చేసుకుంటాను అని సమాధానం ఇస్తూ వచ్చారు. అయితే ఆ పుట్టినరోజుకు ఎక్కువ మంది హాజరయ్యి ఉంటే ఇలాంటి అనుమానాలు వచ్చేవి కావు. కానీ కరోనా ఎఫెక్ట్ తో కేవలం తమ కుటుంబ సభ్యుల మధ్య జరిగిన పుట్టిన రోజుకు ఆమె హాజరవడంతో గుస గుసలు మొదలయ్యాయి.  ఇక దీనిపై పూర్తి స్పష్టత రావాలంటే వెయిట్ చేయాల్సిందే.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *