Type to search

‘ఆచార్య’ కోసంపురాతన ఆలయం సెట్!

Box Office Latest News Trenging News

‘ఆచార్య’ కోసంపురాతన ఆలయం సెట్!

మెగా స్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య చిత్రానికి సంబంధించి పలు ఊహాగానాలు వేడెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో సామాజిక కథాంశం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే 40 శాతం చిత్రీకరణ పూర్తవ్వగా.. వైరస్ సంక్షోభం వల్ల కొంత గ్యాప్ తీసుకోవలసి వచ్చింది.కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రంలో  చిరంజీవి దేవదాయ శాఖ ఉద్యోగి పాత్రలో కనిపించనున్నారు. ఈ క్యారెక్టర్ ఉన్న కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి ఓ పురాతన ఆలయం సెట్‌ను వేయిస్తున్నారట మేకర్స్‌. ముందుగా ఏదైనా గుడిలో షూటింగ్ చేద్దామనుకున్నా.. ఇప్పుడున్న పరిస్థితిలో అది కుదిరేలా లేదు దాంతో ఆలయం సెట్ వెయ్యాలని నిర్ణయించారట చిత్రయూనిట్ . ఇక ఈ సినిమాలో మెగాస్టార్ సరసన చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. రామ్ చరణ్ మాజీ నక్సలైట్ గా కనిపించబోతున్నాడు. చరణ్ పాత్ర ఎమోషనల్ పాత్రగా ఉంటుందని టాక్ .

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *