Type to search

అల వైకుంఠ పురం లో ఈ నటుడి పాత్రే కీలకం అంట…

Box Office

అల వైకుంఠ పురం లో ఈ నటుడి పాత్రే కీలకం అంట…

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా అల వైకుంఠ పురం లో. ఈ సినిమా జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సాంగ్స్, టీజర్ తో దుమ్ముదులువుతున్నాడు అల్లుఅర్జున్. ఇప్పటికే ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటివరకూ రిలీజ్ అయిన పాటలు యూట్యూబ్ లో భారీ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి.
ఈ సినిమాలో విలక్షణ నటుడు సముద్రకని కీలకపాత్ర లో కనిపిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన టీజర్లో సముద్రకని కార్ దిగుతూ ఇచ్చిన హావభావాలు అనుకరిస్తూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది. అయితే ఇది ఒక్కటే కాదు ఇలాంటి సముద్రకని, అల్లుఅర్జున్ ల మధ్య వచ్చే సన్నివేషాలు ప్రేక్షకులను కడుపుబ్బానవ్విస్తాయని తెలుస్తోంది. ఎంతో సీరియస్ యాక్షన్ సీన్లు అయినప్పటికీ బన్నీ ఇచ్చే కౌంటర్లు ఫుల్ కామెడీపంచుతాయని చిత్ర యూనిట్ తెలిపింది. . సినిమా మొత్తానికి సముద్రకని నటన హైలెట్ గా నిలుస్తుందని చిత్ర యూనిట్ చెప్తుంది.
ఈ సినిమాలో అల్లుఅర్జున్ సరసన పూజాహెగ్డే నటిస్తుంది. మరో వైపు సీనియర్ నటి టబు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. . ‘జులాయి’.. ‘S/o సత్యమూర్తి’ లాంటి హిట్స్ తర్వాత అల్లు అర్జున్- త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *