Type to search

అల వైకుంఠ‌పుర‌ములో` మ్యూజిక‌ల్ కాన్‌సర్ట్

Box Office

అల వైకుంఠ‌పుర‌ములో` మ్యూజిక‌ల్ కాన్‌సర్ట్

అల వైకుంఠ‌పుర‌ములో` మ్యూజిక‌ల్ కాన్‌సర్ట్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా శ్రీమ‌తి మ‌మ‌త స‌మ‌ర్ప‌ణ‌లో హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్‌, గీతాఆర్ట్స్ ప‌తాకాల‌పై స్టార్ డైరెక్టర్ త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర‌వింద్, ఎస్‌.రాధాకృష్ణ(చిన‌బాబు) నిర్మిస్తోన్న చిత్రం `అల వైకుంఠ‌పుర‌ములో`. ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందించిన ఈ సినిమా మ్యూజిక‌ల్ కాన్‌స‌ర్ట్ సోమ‌వారం హైద‌రాబాద్ యూసఫ్ గూడ్ పోలీస్ గ్రౌండ్స్‌లో అభిమానులు, సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో…
ఫైట్ మాస్టర్స్ రామ్ ల‌క్ష్మణ్ మాట్లాడుతూ – “ఇక్క‌డ ప్రేక్ష‌కుల ఉత్సాహం చూస్తుంటే ఒక సంక్రాంతి స‌రిపోదేమో అనిపిస్తుంది. ఈ సంక్రాంతికి వ‌స్తోన్న అల వైకుంఠ‌పుర‌ములో ద‌ర్శ‌కుడు, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్‌కి థ్యాంక్స్ చెప్పాలి. ఈ సినిమాలో మాతో నార్మ‌ల్ ఫైట్సే కాదు.. పాట‌లో కూడా ఫైట్ చేయించిన ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్‌గారు. ఈ వేడుక చూస్తుంటే ఆల్ రెడీ సినిమా హిట్ట‌యిన ఫీలింగ్ క‌లుగుతుంది. త‌మ‌న్ సంగీతం అందించిన సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న స‌హా అన్నీ సాంగ్స్ హిట్. పి.ఎస్‌.వినోద్‌గారు అద్భుత‌మైన విజువ‌ల్స్ చూపించారు. ఈ గొప్ప సినిమాలో మాకు అవ‌కాశం క‌లిగించిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు థ్యాంక్స్. అల్లు అర్జున్‌గారికి డ్యాన్సులే కావు.. అదే స్టైల్లో గొప్ప‌గా ఫైట్స్ కూడా కంపోజ్ చేశాం. రేపు థియేట‌ర్స్ సినిమాను అంద‌రూ ఎంజాయ్ చేస్తారు“ అన్నారు.
దిల్‌రాజు మాట్లాడుతూ – “మా వెంక‌టేశ్వ‌రుని ఆశీస్సులతో వైకుంఠ‌పురంలాంటి సెట్‌లో ఈ వేడుక‌ను త్రివిక్ర‌మ్‌గారు చేయ‌డం ఆనందంగా ఉంది. బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టేశారు. ఇప్ప‌టికే త‌మ‌న్ పాట‌ల‌తో ఇర‌గొట్టేశాడు. బ‌న్నీ డ్యాన్సుల‌తో ఇర‌గొట్టేశాడు. త్రివిక్ర‌మ్ గారు పంచ్ డైలాగ్స్‌తో ఇర‌గొట్టేస్తాడు. ఇక సినిమా బావుందంటే చాలు.. మెగా ఫ్యాన్స్ సినిమా చూసి స‌క్సెస్‌తో ఇర‌గ్గొట్టేస్తారు. బ‌న్నీ, త్రివిక్ర‌మ్‌గారి కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న ఈసినిమా పెద్ద స‌క్సెస్ కావాలి. ఈ మ‌ధ్య ఇలాంటి మ్యూజిక‌ల్ హిట్ ఆల్బ‌మ్ చూడ‌లేదు. ఒక్కొక్క సాంగ్ 100 మిలియ‌న్స్ క్రాస్ అయిపోతున్నాయి. త‌మ‌న్ రాకింగ్ మ్యూజిక్ ఇచ్చాడు. ప్ర‌తి ఒక్క‌రికీ ఆల్ ది బెస్ట్‌“ అన్నారు.
డా.కె.వెంక‌టేశ్వ‌ర‌రావు మాట్లాడుతూ – “త‌మ‌న్ అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు. ఇప్ప‌టికే సినిమా పాట‌ల‌కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చాయి. సినిమా డెఫ‌నెట్‌గా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటూ బ‌న్నీ, అర‌వింద్‌, రాధాకృష్ణ, త‌మ‌న్ స‌హా అంద‌రికీ ఆల్ ది బెస్ట్‌“ అన్నారు.

సినిమా థియేట్రికల్ ట్రైల‌ర్‌ను చిత్ర నిర్మాత‌లు అల్లు అర‌వింద్, ఎస్‌.రాధాకృష్ణ‌(చిన‌బాబు) విడుద‌ల చేశారు*

మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ మాట్లాడుతూ – నేను కూడా బ‌న్నీకి చాలా పెద్ద ఫ్యాన్‌ని. ఒక ఫ్యాన్‌గా ఉంటేనే ఇలా కంపోజ్ చేయ‌గ‌లం. త్రివిక్ర‌మ్‌గారికి థ్యాంక్స్‌. ఆయ‌న వ‌ల్లే నేను ఇక్క‌డ నిల‌బ‌డి ఉన్నాను. అలాగే నిర్మాత‌లు, రెండు పెద్ద బ్యాన‌ర్స్ హారిక అండ్ హాసిని, గీతాఆర్ట్స్ ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. అందరికీ పెద్ద థ్యాంక్స్‌“ అన్నారు.
సింగ‌ర్ అర్మాన్ మాలిక్ మాట్లాడుతూ – “నా పేరు సూర్య త‌ర్వాత బ‌న్నీగారి సినిమాలో నేను పాడుతున్నాను. బుట్ట బొమ్మ‌లాంటి మంచి సాంగ్‌ను నాకు ఇచ్చినందుకు త‌మ‌న్‌గారికి థ్యాంక్స్‌“ అన్నారు.
రామ‌జోగ‌య్య శాస్త్రి మాట్లాడుతూ – “కొంత మందితో ప‌నిచేస్తుంటే క‌ష్టం, స‌మ‌యం తెలియ‌దు. బుట్ట బొమ్మ సాంగ్‌ను రాశాను. త్రివిక్ర‌మ్‌గారితో ప‌నిచేయ‌డ‌మంటే పండ‌గ‌లా ఉంటుంది. చాలా స‌రదాగా ఉంటారు. ఈ పాట‌కు వ‌ర్క్ చేయ‌డం చాలా సంతోషంగా ఉంది. త‌మ‌న్ ఈ సినిమాకు ఎక్స్‌ట్రార్డిన‌రీ మ్యూజిక్ ఇచ్చాడు. త‌న‌కు స్పెష‌ల్ థ్యాంక్స్‌. బ‌న్నీ, విశాల‌మైన హృద‌య‌మున్న వ్య‌క్తి. ఆయ‌న‌తో చాలా సినిమాల‌కు పనిచేశాను. ఈ సినిమాకు ప‌నిచేయ‌డం గొప్ప‌గా అనిపించింది“ అన్నారు.

హీరో సుశాంత్ మాట్లాడుతూ – “ఈ సినిమా కోసం న‌న్ను ఎంపిక చేసిన బ‌న్నీగారికి, త్రివిక్ర‌మ్‌గారికి థ్యాంక్స్‌. క‌థ విన‌కుండానే ఈ సినిమా చేయాల‌ని ఫిక్స్ అయ్యాను. బ‌న్నీతో క‌లిసి త్రివిక్ర‌మ్‌గారి ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌డం చాలా సంతోషాన్నిచ్చింది. బ‌న్నీ, త్రివిక్ర‌మ్‌గారు, చిన‌బాబుగారు, అల్లు అర‌వింద్‌గారికి థ్యాంక్స్‌. న‌న్ను నాకే కొత్త‌గా త్రివిక్ర‌మ్‌గారు చూపించారు. నేను ఇలా కూడా చేయ‌వ‌చ్చా అనిపించింది. ఈ సినిమా చేయ‌డం చాలా హెల్ప్ అయ్యింది. ఇలా కంఫ‌ర్ట్‌గా ఫీల్ అవుతాన‌ని నేను అనుకోలేదు. బ‌న్నీ నాకు ఫ్రెండ్‌గా బాగా తెలుసు. అయినా నా కంఫ‌ర్ట్ నాకు ఇచ్చాడు. ట‌బుగారిని నిన్నే పెళ్ళాడ‌తా స‌మయంలో ఆమెను సెట్స్‌లో క‌లుసుకున్నాను. త‌ర్వాత యాక్టింగ్ స్కూల్‌కోసం ముంబై వెళితే.. ట‌బుగారు ఇంట్లో పెట్టుకుని జాగ్ర‌త్త‌గా చూసుకున్నారు. ఆవిడతో క‌లిసి ఈ సినిమాకు ప‌నిచేయ‌డం గౌర‌వంగా భావిస్తున్నాను. పూజ, నివేదా, న‌వ‌దీప్‌, సముద్ర‌ఖ‌ని ఇలా ఎంటైర్ టీమ్ గొప్ప‌గా కుదిరింది. గొప్ప అవ‌కాశంగా భావిస్తున్నాను. త‌మ‌న్‌కి, పి.ఎస్‌.వినోద్‌గారికి థ్యాంక్స్‌“ అన్నారు.
ప్రియా సిస్ట‌ర్స్ మాట్లాడుతూ – “12 ఏళ్ల క్రితం ఓ తెలుగు మూవీలో పాడాం. ఇన్నేళ్ల‌కు ఈ సినిమాలో పాడాం. ఐదారు లైన్ పాటే అయినా కానీ.. ట్యూన్ ప‌రంగా చాలా క్లిష్ట‌మైన ట్యూన్‌. బ‌మ్మెర‌పోత‌న‌గారి ప‌ద్యాన్ని పాడే అవ‌కాశాన్ని క‌లిగించినందుకు త్రివిక్ర‌మ్‌గారిని, అర‌వింద్‌గారికి, అల్లు అర్జున్‌గారికి థ్యాంక్స్‌“ అన్నారు.

సునీల్ మాట్లాడుతూ – “సినిమా టికెట్ కొని థియేట‌ర్‌లోకి వ‌చ్చిన ప్రేక్ష‌కుడిని బ‌న్నీ, పూజా, టబు, సుశాంత్‌, నివేదా, స‌ముద్ర‌ఖ‌ని, సునీల్ ఇలా అంద‌రం మీ ఇంటికి వ‌చ్చిన‌ట్లు సినిమా ఉంటుంది. పండ‌గ‌కి మేమే మీ ఇంటికి వ‌చ్చిన‌ట్టు ఉంటుంది. త్రివిక్ర‌మ్ గురించి ఎంత త‌క్కువ మాట్లాడినా ఎక్కువే. బ‌న్నీ గురించి చెప్పాలంటే.. ఎలాంటి యాట్యిట్యూడ్ లేని హీరో. త‌ప్ప‌కుండా ఆయ‌న న‌టించిన ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది“ అన్నారు.
నివేదా పేతురాజ్ మాట్లాడుతూ – “ఈ సినిమాలో బ‌న్నీతో క‌లిసి వ‌ర్క్ చేయ‌డం చాలా సంతోషంగా ఉంది. తెలుగు, త‌మిళంలో నేను ప‌నిచేసి పెద్ద సినిమా ఇదే. త్రివిక్ర‌మ్‌గారు సినిమాను డిఫ‌రెంట్‌గా తెర‌కెక్కించారు.బ‌న్నీ, త్రివిక్ర‌మ్‌, అర‌వింద్‌, సుశాంత్‌, చిన‌బాబు స‌హా అంద‌రికీ పెద్ద థ్యాంక్స్‌. సినిమా కోసం ఎగ్జ‌యిటెడ్‌గా వెయిట్ చేస్తున్నానుఅన్నారు.

టబు మాట్లాడుతూ – “ప్రేక్ష‌కులు చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే మాట‌లు రావ‌డం లేదు. చాలా సంవ‌త్సరాల త‌ర్వాత తెలుగులో యాక్ట్ చేశాను. త్రివిక్ర‌మ్‌గారు, బ‌న్నీగారు, అర‌వింద్‌గారు, సుశాంత్ అంద‌రూ కుటుంబ స‌భ్యుల్లాగా మారిపోయారు. ఇంత గ్యాప్ త‌ర్వాత తెలుగులో ఈ సినిమా కంటే గొప్ప‌గా రీ ఎంట్రీ ఇవ్వ‌లేనేమో అనిపించింది. త‌ప్ప‌కుండా సినిమా పెద్ద స‌క్సెస్ అవుతుంది. అంద‌రికీ చాలా థ్యాంక్స్‌“ అన్నారు.

సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి మాట్లాడుతూ – “ఈ వేడుక చూస్తుంటే డ‌బుల్ బొనాంజా, సూప‌ర్‌డూప‌ర్‌హిట్ సినిమాలా అనిపిస్తుంది. త్రివిక్ర‌మ్ సినిమాకు అంద‌మైన పేరు పెట్టాడు. అంతే అందంగా సినిమా ఉంటుంది. ఈ వైభ‌వాన్ని అంతా బ‌న్నీయే త‌న భుజాల‌పై మోస్తున్నాడు. ఆయ‌న‌తో పాటు ఇందులో న‌టించిన ప్ర‌తి ఒక్క‌రికీ అభినంద‌న‌లు. ఈ క‌థ‌ను సంక్రాంతి పండ‌గ‌లా అందంగా తీర్చిదిద్దిన త్రివిక్ర‌మ్‌గారికి ప్ర‌త్యేక‌మైన అభినంద‌న‌లు. ఈ పాట‌ల‌కు ప్రేక్ష‌కులు మ‌న‌సుతో విన్నారు. సంగీతానికి భాష లేదు అనేలా అద్భుత‌మైన సంగీతాన్ని అందించిన త‌మ‌న్‌కు అభినంద‌న‌లు. కుర్ర‌ద‌నంతో సామ‌జ‌వ‌రగ‌మ‌న పాట రాశాన‌ని పాట విన్న‌వారంద‌రూ అన్నారు. అయితే నేను కుర్రాడిలా మారిపోలేదు.. అల్లు అర్జున్‌లా మారిపోయాను. త్రివిక్ర‌మ్ ఇచ్చిన సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న అనే ప‌దాన్ని ఉప‌యోగించుకుని పాట‌ను రాశాను. ఈ స‌ర‌స్వ‌తి వైభ‌వాన్ని చూడ‌టానికి క‌లికి శ్రీమ‌హాల‌క్ష్మి థియేట‌ర్స్‌కు వ‌స్తుంది“ అన్నారు.
ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ మాట్లాడుతూ – “ఈ సినిమాను క‌ష్ట‌ప‌డి తీసింది నా స్నేహితుడు రాధాకృష్ణ‌గారే. ఆయ‌న‌కు అభినంద‌న‌లు. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ చిన్న క‌థ‌ను బ్ర‌హ్మాండంగా తీసి, రిలీజ్‌కుముందే హిట్ అనే రూపాన్ని ఇచ్చాడు. త‌మ‌న్ 2019 వీడ్కోలు చెప్ప‌డానికి ప్ర‌తిరోజూ పండ‌గే సినిమా, ఈ 2020 వెల్‌క‌మ్ చెప్ప‌డానికి అల వైకుంఠ‌పుర‌ములో సినిమా ఇచ్చాడు. త‌న‌కు థ్యాంక్స్‌“ అన్నారు.


స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ మాట్లాడుతూ – “ఓ రూమ్‌లో మ‌ధ్యాహ్నం 3-4 గంట‌ల ప్రాంతంలో పెద్ద‌గా ట్రాఫిక్ లేని స‌మ‌యంలో 30 ఏళ్ల యువ‌కుడు, 60 ఏళ్ల పెద్దాయ‌న కూని రాగం తీసుకుంటూ రాసిన పాట కొన్ని కోట్ల మంది హృద‌యాల‌ను తాకింది. అదే సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న. త‌న వ‌య‌సు నుంచి దిగి ఆయ‌న‌, త‌న వ‌య‌సును ఎక్కి త‌మ‌న్ క‌లిసి ఓ కామన్ పాయింట్‌ను క‌లిపి ఈ చిత్రానికి స్థాయిని తీసుకొచ్చారు. మా గుండెలు ప‌ట్ట‌నంత ఆనందాన్ని మీకు వినిపించేయాలి.. మా క‌ళ్ల‌ల్లో వ‌చ్చిన నీటి చుక్క మీ అంద‌రి క‌ళ్ల‌ల్లోకి ఎలా రావాలి. ఓ సాయంత్రం కారులో వెళ్లే అబ్బాయి త‌న ప్రేయ‌సి గుర్తు తెచ్చుకుంటూ.. అలాగే సాయంత్రం త‌న‌ను చూస్తున్న యువ‌కుడిని చూడ‌న‌ట్లు న‌టిస్తూ త‌న హెడ్ ఫోన్స్‌లో విన‌డానికి ఒక అత్య‌ద్భుత‌మైన క‌ళ్ల‌ని, ఒక జ్ఞాప‌కాన్ని ఇద్ద‌రూ మ‌న‌కు ఇచ్చారు. దానికి త‌న‌కు గొంతునిచ్చి సిద్ శ్రీరామ్ ఈ పాట‌ను మ‌న అంద‌రి గుండెల్లోకి తీసుకొచ్చేశాడు. ఓ పాట మ‌న‌కు ఊతం చేయి ప‌ట్టుకుని న‌డ‌వొచ్చు.. ఓ పాట మ‌న‌కు స్నేహితురాలు మ‌న క‌ష్టాలు చెప్పుకోవచ్చు. అది మ‌న ప్రేయ‌సి త‌న ఒళ్లో మ‌న త‌లను పెట్టుకుని ప్రేమ‌ను పొంద‌వ‌చ్చు. మ‌న గురువు.. మ‌న‌కు అవ‌స‌రం వ‌చ్చిన‌ప్పుడు మ‌న‌కు జ్ఞానాన్ని బోధిస్తుంది అలాంటి పాట‌ను ఇచ్చిన వారిని గౌర‌వించాల‌నిపించింది. అందుకే దీనికి మ్యూజిక‌ల్ నైట్ పేరు పెట్టి కండ‌క్ట్ చేశాం. ఈ కోరిక‌ను బ‌లంగా మ‌న ముందుకు తీసుకొచ్చింది అల్లు అర్జున్‌. జులాయిలో పెళ్లి కానీ అబ్బాయిగా తెలుసు. ఇప్పుడు ఇద్ద‌రి పిల్ల‌ల తండ్రిగా త‌న తాలూకు మెచ్యూరిటీని త‌న మాట‌లు, జీవితంలో, ప‌నిలో ప్ర‌తి దాంట్లో పెడుతున్నాడు. మేం క‌నే క‌ల మీ అంద‌రికీ మంచి జ్ఞాప‌కం కావాలి. దీని కోసం మేం ఎంత అడ్వేంచ‌రెస్‌గా నిర్ణ‌యాలు తీసుకున్నా, మీ వెనుక మేం ఉన్నామంటూ అర‌వింద్‌గారు, చిన్న‌బాబుగారు నిల‌బ‌డి మేం అడిగిదానల్లా గొప్ప‌గా ఇచ్చారు. ఇంత గొప్ప సంగీతాన్ని అందించిన ప్ర‌తి ఒక్క‌రికీ మ‌న‌స్ఫూర్తిగా నా ఆశీస్సులు అందిస్తున్నాను. అలాగే ఈ సినిమాలో ప‌నిచేసిన ప్ర‌తి ఒక్క‌రూ ఏదో ర‌కంగా మ‌న‌సుకు ద‌గ్గ‌రైన వాళ్లే. వాళ్లంద‌రికీ నేను చెప్పే మాట ఒక‌టే.. వాళ్లంద‌రితో నేను ప్రేమ‌లో ఉన్నాను. ఈ సినిమా రిలీజ్ త‌ర్వాత కొద్దిపాటి విర‌హాన్ని అనుభ‌విస్తాను. మ‌ళ్లీ ఓ క‌థ‌ను రాస్తాను. మ‌ళ్లీ మిమ్మ‌ల్ని క‌లుస్తాను. ఈ సినిమాకు మొద‌లు, చివ‌ర అల్లు అర్జునే. ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్న‌ప్పుడు ఏదీ చేసినా హ్యాపీగా చేద్దాం సార్ అని అన్నాడు. అప్ప‌టి నుండి 11 నెల‌లు పాటు ఈ జ‌ర్నీ చేశాం. మేం కాకినాడ‌లో షూటింగ చేస్తున్న‌ప్పుడు పాట‌ల లిరిక‌ల్ వీడియోలు రొటీన్‌గా ఉన్నాయి. పాట కోసం ప‌నిచేసి టెక్నీషియ‌న్స్ క‌నిపించేలా ఏదైనా కొత్త‌గా చేద్దామ‌ని ఆయ‌న అన్నారు. అదే మీరు చూసిన సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న పాట‌.. అలా నాతో స‌హా అంద‌రినీ ఎంతో ఇన్‌స్పైర్ చేశారు. ఆయ‌న లైఫ్‌లో ఇంకా చాలా ముందుకు వెళ్లాల‌ని కోరుకుంటున్నాను. ఆ ప్ర‌యాణంలో మేం కూడా భాగ‌మ‌వుతాం. మేం ప‌నిచేయ‌లేని సినిమాల‌కు మేం సాక్షుల‌మ‌వుతాం, ప్రేక్ష‌కుల‌మ‌వుతాం. మేం ప‌నిచేసే సినిమాల‌కు ద‌ర్శ‌కుల‌మ‌వుతాం. అంద‌రి ప్రేమ మాపై ఇలాగే ఉండాలి.

12న క‌లిసి పండ‌గ చేసుకుందాం. ఆనందంగా ఉంది. అల వైకుంఠ‌పుర‌ములో మీకు స్వాగతం ప‌లుకుతుంది అన్నారు.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *