Type to search

అరుదైన 30 అండర్ 30 అవార్డును దక్కించుకున్న సాయి పల్లవి!

Box Office Latest News Trenging News

అరుదైన 30 అండర్ 30 అవార్డును దక్కించుకున్న సాయి పల్లవి!

పక్కింటి అమ్మాయి ఇమేజ్‌ తో తెలుగు సినిమాల్లో తన నటనతో ఆకట్టుకుని స్టార్ కధానాయికగా మారిన హీరోయిన్ సాయి పల్లవి. మళయాళీ అమ్మాయి అమ్మాయి అయినా తెలుగు సినిమాల్లో పేరును.. ప్రేక్షకుల్లో అభిమానాన్ని సంపాదించుకుంది సాయి పల్లవి. తెలుగుతోపాటు తమిళ, మళయాళంలో సాయి పల్లవికి మంచి క్రేజ్ ఉంది. సెలెక్టెడ్ స్క్రిప్ట్స్ చేస్తూ మంచి సంపాదన ఆర్జిస్తోంది.
తాజాగా సాయి పల్లవికి అరుదైన ఘనత దక్కింది. ప్రఖ్యాత బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్‌ తాజాగా `ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30` జాబితాను విడుదల చేసింది. 30 సంవత్సరాలలోపు తమ తమ రంగాల్లో విజయాలను సాధించిన 30 వ్యక్తుల జాబితాను ప్రకటించింది. ఆ జాబితాలో 27 సంవత్సరాల సాయి పల్లవి చోటు దక్కించుకుంది.

ప్రతి ఏటా ఫోర్బ్స్ 30 అండర్ 30 పేరుతో జాబితా ప్రకటిస్తారు. వివిధ రంగాల్లో 30 ఏళ్ల వయసు లోపు యువతీ యువకుల్లో వారు సాధించిన విజయాలు, సాధిస్తున్న విజయాల ఆధారంగా ఈ అవార్డులు ప్రకటిస్తారు. ఇందులో భాగంగా దక్షిణాది నుంచి సినిమాల్లో ఈ ఏడాదికి గౌరవం దక్కించుకుని సెన్షేషన్ క్రియేట్ చేసింది.
‘నాకు నటించడం రాకపోయినా ప్రేక్షకులు ఇచ్చిన ధైర్యమే నన్ను ముందకు నడిపిస్తోంది. ఈరోజు సాధించిన ఈ ఘనతకు కారణం వారే. నన్ను, నానటనను వాళ్లు అంగీకరించబట్టే. ఫోర్బ్స్ 30 అండర్ 30లో స్థానం సంపాదించినందుకు నేను సంతోషిస్తున్నాను’ అని తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసింది.
తెలుగులో రానాతో కలిసి `విరాటపర్వం`లోనూ, శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న `లవ్‌స్టోరీ`లోనూ సాయి పల్లవి నటిస్తోంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *