Type to search

అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ గా రిలీజ్ అవుతున్నతొలి తెలుగు సినిమా!

Box Office Latest News Trenging News

అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ గా రిలీజ్ అవుతున్నతొలి తెలుగు సినిమా!

 

మ‌హాన‌టి త‌రువాత కొంతకాలం గ్యాప్ తీసుకున్న కీర్తి  తాజాగా న‌టించిన సినిమా ‘పెంగ్విన్’. ఆస‌క్తిక‌ర క‌థ‌, క‌థ‌నంతో తెరకెక్కిన ఈ చిత్రానికి ఈశ్వ‌ర్ కార్తిక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.   స్టోన్ బెంచ్ ఫిల్మ్ ప‌తాకం పై కార్తీక్ సుబ్బ‌రాజ్ ఈ సినిమాను నిర్మించారు. ఇక ఈ సినిమా తెలుగు తమిళ్ మలయాళం లో రిలీజ్ కాబోతుంది. ఇక మ‌హాన‌టి చిత్రానికి థియేట‌ర్ లోనే కాదు వ‌ర‌ల్డ్ బెస్ట్ ఆన్ లైన్ స్టీమింగ్ నెట‌వ‌ర్క్ అమెజాన్ ప్రైమ్ లో కూడా విశేష ఆద‌ర‌ణ ల‌భించిన సంగ‌తి తెలిసిందే. దేశంలో లాక్ డౌన్  నేపథ్యంలో థియేటర్స్ ఓపెన్ అయ్యాయి పరిస్థితి ఇప్పట్లో కనిపించడం ఈ నేప‌థ్యంలో పెంగ్విన్ చిత్రాన్ని కూడా అమెజాన్ ప్రైమ్ఎక్స్ క్లూజివ్ గా ఆడియోన్స్ కి అందిచ‌బోతున్నారు. ఈ సినిమాను డైరెక్ట్ గా  అమెజాన్ ప్రైమ్ లోనే విడుద‌ల చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ గా రిలీజ్ అవుతున్న తొలి తెలుగు సినిమా పెంగ్వీన్ కావడం మరో విశేషం.మ‌హాన‌టి సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకొని , తెలుగు ప్రేక్షకుల‌కి అత్యంత‌గా చేరువైన న‌టి కీర్తి సురేశ్. ఇటీవ‌లే నేష‌న‌ల్ అవార్డ్ ని కూడా కైవ‌సం చేసుకుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *