Type to search

అభిమానులకు పవన్ మూడు సర్ప్రైజ్ కానుకలు

Box Office Latest News Trenging News

అభిమానులకు పవన్ మూడు సర్ప్రైజ్ కానుకలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో మళ్ళీ సినిమాలోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా లాక్ డౌన్‌కి ముందే 70 శాతం షూటింగ్‌ని పూర్తి చేసుకుంది. మిగిలిన షూటింగ్‌ కరోనా కారణంగా వాయిదా పడింది. డైరెక్టర్ వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌ న్యాయవాదిగా కనిపించనున్నాడు. అయితే పవన్ పుట్టిన రోజు సెప్టెంబర్ 2న ఈ సినిమా నుంచి ఏదో ఒక అప్డేట్ వస్తుంది అని ఆయన అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.అయితే ఏకంగా తన అభిమానులకు పవన్ మూడు గిఫ్టులను ప్లాన్  చేసారు . వకీల్ సాబ్ తో పాటు మరో రెండు సినిమాల అప్డేట్ కూడా రేపు రాబోతున్నాయి. పవన్ ఇప్పటికే అధికారికంగా మూడు సినిమాలను అనౌన్స్ చేసాడు. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ ఆనందాన్ని రెట్టింపు చేయడానికి రేపు పవన్ నటిస్తున్న మూడు సినిమాల నుంచి సర్ప్రైజ్ గిఫ్ట్స్ రాబోతున్నాయి. వకీల్ సాబ్ నుంచి ఉదయం గం 9.09 నిమిషాలకు సప్రైజ్ రాబోతుందని మేకర్స్ ప్రకటించారు. దీంతో పాటు పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్న 27వ సినిమా అప్డేట్ మధ్యాహ్నం 12.30 నిమిషాలకు రాబోతుందని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇక పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న మూవీ అప్డేట్ సాయంత్రం 4.05 నిమిషాలకు రాబోతుందని మేకర్స్ ప్రకటించారు. మరి పవన్ కళ్యాణ్ బర్త్ డే నాడు రానున్న మూడు సర్ప్రైజులు ఎలా ఉండబోతున్నాయో చూడాలి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *