Type to search

అన్ని రకాల ప్రేమలను గుర్తు చేసిన వరల్డ్ ఫేమస్ లవర్

Box Office Latest News Movie Reviews Trenging News

అన్ని రకాల ప్రేమలను గుర్తు చేసిన వరల్డ్ ఫేమస్ లవర్

ప్రేమ ఇచ్చే అనుభూతి మరి ఎందులోనూ రాదు .. ఎక్కడ వెతికినా దొరకదు. సంతోషానికి కారణం . కానీ ప్రేమను , ప్రేమించిన వారిని నిర్లక్ష్యం చేస్తే ఆ జంట మధ్య జరిగే అలజడి ఎలా ఉంటుందో చూపెట్టేదే వరల్డ్ ఫేమస్ లవర్’.

‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రాన్ని ప్రేమికుల దినోత్సవ కానుకగా నేడు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ‘
ఇక ఈ చిత్రం కథ లోకి వెళ్తే …
గౌతమ్ (విజయ్ దేవరకొండ) ఓ అనాథ. మంచి రైటర్ కావాలని కలలు కంటూ తన చదువుకి తగ్గ ఉద్యోగం వచ్చినా కూడా దాన్ని పక్కనపెట్టి మంచి పుస్తకం రాయాలనుకుంటాడు. కాలేజ్‌లో యామిని (రాశీ ఖన్నా) పరిచయంతో అతని లైఫ్ గోల్ టర్న్ అవుతుంది. కడుపు మార్చుకుంటూ రచయిత కాలేం కదా.. నాకోసం మన ప్రేమ కోసం ఉద్యోగం చేయి అని చెప్పడంతో ప్రేయసి కోసం ఉద్యోగంలో చేరి మంచి స్థితికి వస్తాడు గౌతమ్. అదే సందర్భంలో కోటీశ్వరురాలైన (రాశీ ఖన్నా)తో పెళ్లికి అతని తండ్రి ఒప్పుకోడు. దీంతో పేరెంట్స్ ఒప్పుకునేంత వరకూ లివింగ్ రిలేషన్ షిప్‌లో ఉందాం అని గౌతమ్, యామిని వేరే ఇంటిలో ఉంటారు. కొన్నాళ్లకు గౌతమ్ ఉద్యోగం మానేసి రాయడం మొదలుపెడతారు. అయితే తన కథల్లో సోల్ దొరక్కపోవడంతో మెల్లగా యామినిని నిర్ణక్ష్యం చేస్తాడు.

ఎంతలా అంటే.. ‘ప్రాణం లేని వస్తువునైనా సరిగా చూడకపోతే ఎందుకూ పనికి రాకుండా పోతుంది.. ప్రాణం ఉన్న పట్టించుకోకపోతే ఎలా గౌతమ్.. ఈ ప్రపంచంలో నిస్వార్ధమైనది ప్రేమ ఒక్కటే.. ఆ ప్రేమలో కూడా నేను అనే రెండు అక్షరాలు సునామినే రేపగలవు. ప్రేమంటే ఒక కాంప్రమైస్ కాదు ప్రేమంటే ఒక సాక్రిఫైస్ ప్రేమలో ఒక దైవత్వం ఉంటుంది అవేవి నీకు అర్ధం కావు’ అని యామిని రోధించేలా. ఏ నిస్వార్ధమైన ప్రేమను గౌతమ్‌లో కోరుకుందో.. అదే లేకపోవడంతో పాటు తాను రచయిత కావాలనుకున్న గోల్‌ని కూడా గౌతమ్‌ పక్కన పెట్టడంతో అతనితో బ్రేకప్ చెప్పేస్తోంది యామిని.

యామిని దూరమైన తరువాత గౌతమ్ ఒంటరి వాడు అవుతాడు. తాను రాయడం లేదనే కదా యామిని దూరమైందని తెలుసుకుని.. ఓ పేపర్‌లో బొగ్గుగనిలో చనిపోయిన భర్తకోసం రోధించే భార్య ఫొటో చూసి ‘వరల్డ్ ఫేమస్ లవర్’ కథ రాయడం మొదలుపెడతాడు గౌతమ్. అలా అతని కలం నుండి వచ్చిన ప్రేమ కథలోని పాత్రలే శీను(విజయ్ దేవరకొండ), సువర్ణ( ఐశ్వర్యా రాజేష్‌), ఈజా బెల్లా (ఈజా), స్మిత (క్యాథరిన్ త్రెసా)లు. ఈ పాత్రల ద్వారా ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అనే కథకు గౌతమ్ ఎలాంటి ముగింపు ఇచ్చారు. యామిని ప్రేమను ఎలా సాధించాడు. యామిని దూరమైన తరువాత గౌతమ్‌లో వచ్చిన మార్పులేంటి? అన్నదే మిగతా కథ.

ఈ కథలో గౌతమ్, యామినిలు ముఖ్యమైన రోల్స్ అయినప్పటికీ.. కథలో భాగంగా వచ్చే పాత్రల్లోని శీనయ్య, సువర్ణ పాత్రలు సినిమాకి మేజర్ హైలైట్. ‘ఇల్లందులో బాగా చదువుకుని అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఎంజాయ్ చేయాలని కలలు కనే శీనయ్య అనుకోకుండా.. బొగ్గుగని పని చేసే తన తండ్రికి యాక్సిడెంట్ కావడంతో బొగ్గుగని కార్మికుడిగా మారతాడు. శీనుకి 20 ఏళ్లకే సువర్ణ (ఐశ్వర్య రాజేష్)ని ఇచ్చి పెళ్లి చేస్తారు. వీళ్లకి ఆరేళ్ల కొడుకు. తాను కోరుకున్న లైఫ్ దొరక్కపోవడంతో తన చుట్టూ ఉన్న ప్రేమను పొందలేకుండా.. తను కావాలనుకున్న ప్రేమకోసం వెతుకుతుంటాడు శీనయ్య. అలాంటి సందర్భంలో బొగ్గుగనికి వెల్ఫేర్ ఆఫీసర్‌గా వచ్చిన స్మిత అట్రాక్షన్‌లో పడతాడు శీనయ్య. స్మిత ఎంట్రీ తరువాత శీనయ్య-సువర్ణ లైఫ్‌లో జరిగిన పరిణామాలను చాలా ఎమోషనల్‌గా భావోద్వేగ సన్నివేశాలతో హృదయాలను హత్తుకునేలా చూపించారు దర్శకుడు క్రాంతి మాధవ్.

రాశీ ఖన్నా పాత్రపై తొలి నుండి బోల్డ్ పాత్ర అనే రూమర్స్ వచ్చినప్పటికీ యామినిగా కెరియర్ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చిందామె. లవ్ అండ్ ఎమోషన్స్ సీన్లలో ఆకట్టుకుంది. క్లైమాక్స్‌లో కథ డిమాండ్ చేయడంతో విజయ్‌‌తో లిప్ లాక్‌ను కానిచ్చేసింది. ఇక స్మిత పాత్రలో క్యాథరిన్ త్రెసా తన పాత్రకు న్యాయం చేసింది. ఫ్యారిస్ సుందరి ఈజా బెల్లా నుండి పెర్ఫామెన్స్ రాబట్టడం చాలా కష్టమే అనిపించింది ఆమె నటన చూస్తే. విజయ్‌కి ఫ్రెండ్‌గా నటించిన ప్రియదర్శి ఉన్నంతలో బాగానే చేశారు.

చదువు రాని భార్య.. తనకి ఆల్ ది బెస్ట్ చెప్పిందని ఇంటికి కేబుల్ కట్ చేయించేటంత కఠినంగా చూపిస్తూనే.. తనకు ఎవరో కొత్త బట్టలు కొంటే.. తన భార్యకు కూడా రెండు చీరలు కొనే సహజ సిద్ధమైన భార్య భర్తల ప్రేమను శీనయ్య-సువర్ణ పాత్రల్లో చూపించారు. ముఖ్యంగా బొగ్గుగని కార్మికుడిగా శీనయ్య తన యాస, భాషల్లో మెస్మరైజ్ చేస్తే.. సువర్ణగా ఐశ్వర్య రాజేష్ తన పెర్ఫామెన్స్ కట్టిపడేసింది. తనకంటే ఎక్కువ చదుకున్నానంటే భర్త అహం ఎక్కడ దెబ్బతింటుందోనని నిజాన్ని దాచి.. అదే భర్త చదువుకుని మోడ్రన్‌గా ఉండే అమ్మాయిని ఇష్టపడుతున్నాడని తెలుసుకుని గోల్డ్ మెడల్ సాధించి మోడ్రన్‌గా రెడీ అయ్యే సీన్‌లో ఐశ్వర్య రాజేష్ తాను ఏడుస్తూనే ప్రేక్షకుల కళ్లు చెమ్మగిల్లేలా చేసింది.

‘వరల్డ్ ఫేమస్ లవర్’ కథ మొత్తం గౌతమ్, యామినిల చుట్టూనే ఉన్నా.. వీరిద్దరూ కలపడం కోసం దర్శకుడు శీను, సువర్ణ, ఈజా పాత్రల్ని పరిచయం చేసి కథను నడిపారు. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ కథ ఎలా ముగుస్తుంది? గౌతమ్-యామినిలు ఎలా కలుసుంటారనే ఆసక్తిని ప్రేక్షకుల్లో కలిగించిన దర్శకుడు చివర్లో సరైన ముగింపు ఇవ్వలేదనే అనిపిస్తుంది. ఫస్టాఫ్ శీనయ్య- సువర్ణ పాత్రలతో మంచి హైప్‌కి వెళ్లిన సినిమా సెకండాఫ్‌లో నెమ్మదించింది. అయితే డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో విజయ్ దేవరకొండ మెచ్యూర్డ్ నటనతో ఆకట్టుకున్నారు. లవ్ ఫెయిల్యూర్ అయిన ప్రేమికుడిగా తనకంటే ఎవరూ బాగా నటించలేరేమో అన్నట్టుగా పాత్రలో ఒదిగిపోయాడు. యామని.. యామిని అంటూ పిచ్చిపట్టిన వాడిలా పాత అర్జున్ రెడ్డిని గుర్తు చేశాడు.

ఇక టెక్నికల్ పరంగా సీనియర్ నిర్మాత కే ఎస్ రామారావు ఖర్చుకు వెనకాడకుండా చాలా రిచ్‌గా సినిమాను తెరకెక్కించారు . ఇక పాటలు పెద్దగా ఆకట్టుకోలేకపోయింది .
మొత్తంగా ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా ఓ కొత్త అనుభూతి. రొమాన్స్, లిప్ లాక్స్ ను ఇలా అన్నీ అనుభూతులను అందిస్తుంది . ‘వరల్డ్ ఫేమస్ లవర్’

Tags:

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *