Type to search

అనంతపురంలో ‘నారప్ప’

Box Office Latest News Trenging News

అనంతపురంలో ‘నారప్ప’

తమిళంలో విజయం సాధించిన ‘అసురన్‌’కి తెలుగు రీమేక్‌ ‘నారప్ప’.. మాతృకలో ధనుష్‌, మంజు వారియర్‌, అమ్ము అభిరామి హీరోహీరోయిన్లుగా నటించారు. తెలుగులో వెంకటేశ్‌ ప్రియమణి జంటగా చేస్తున్నారు. అమ్ము అభిరామి పాత్ర కోసం అమలా పాల్‌ను ఎంపిక చేసిందీ చిత్రబృందం. ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ కూడా విడుదలై ఆకట్టుకుంది. ఇటీవలే అమలా పాల్‌ ఇటీవల ‘ఆమె’చిత్రంలో నటించింది. హిందీలో మహేశ్‌ భట్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ రూపొందిస్తున్న వెబ్‌ సిరీస్‌లోనూ చేస్తోంది. ‘నారప్ప’ సినిమాకు శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగం గా జరుగుతోంది. అందులో భాగంగా సహజంగా ఉండేందుకు ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ మొన్నటి వరకు తమిళనాడులోని కురుమలలైలో భారీ షెడ్యూల్‌ను, యాక్షన్‌ సన్నివేశాలను పూర్తి చేశారు. ప్రస్తుతం అమలా పాల్‌ పాల్గొనే సన్నివేశాలను అనంతరపురంలో చిత్రీకరించనున్నారు. సినిమాను సమ్మర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తోంది చిత్రబృందం.

Tags:

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *