Type to search

అదే పవర్ తో కొత్త మూవీ కి ఒకే చెప్పిన పవన్

Box Office Latest News Trenging News

అదే పవర్ తో కొత్త మూవీ కి ఒకే చెప్పిన పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు అభిమానుల ఆశలు తీరుస్తూ వెండితెరపైకి రీ ఎంట్రీ ఇచ్చారు ఒకవైపు పొలిటీషన్‌గా, మరోవైపు నటుడిగా క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు। ఇప్పటికే ‘పింక్’ రీమేక్ షూటింగ్‌‌ వేగంగా జరుగుతోంది లేటెస్ట్ గా క్రిష్ డైరెక్షన్‌లో మరో మూవీకి పచ్చజెండా ఊపి ఫ్యాన్స్‌కి ఏకంగా పండగనే తీసుకువచ్చారు అయితే ఫ్యాన్స్‌ రిక్వెస్ట్‌తో పాటు గతంలో నిర్మాతలకు సినిమా చేస్తానని హామి నేపథ్యంలో పవన్ పునరాగమనం చేసినట్టు తెలుస్తోంది.

క్రిష్ చెప్పిన స్టోరీ పవన్ కి చాలా నచ్చిందట . అందుకే మరో సారి చర్చించ కుండానే స్పాట్‌లో ఓకే చేశారని ఫిల్మ్ నగర్ టాక్. ఇక షూటింగ్ కూడా కూడా అంతే స్పీడ్ గా స్టార్ట్ చేశారు క్రిష్  రామానాయుడు స్టూడియోస్ లాంఛనంగా పూజా కార్యక్రమాలతో షూటింగ్ ప్రారంభం అయ్యింది। అయితే పవన్‌కి ఇది 27వ సినిమా ఇది స్వాతంత్య్రానికి ముందు పరిస్థితులకు తగ్గట్టుగా ఒక పీరియాడిక్ స్టోరీ అని తెలుస్తోంది మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై।।ఏఎమ్ రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక పవన్ ప్రి లుక్‌ కూడా రిలీజ్ చేసింది మూవీ టీం।.ముఖానికి ఎర్ర తువాలు కట్టుకుని, రౌంధ్రంతో ఉన్న పవన్ కళ్లు.సో ఈ లుక్ చూసి పవన్ ఫాన్స్ తెగ సంబర పడిపోతున్నారు.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *